సినిమా ఇండస్ట్రీలో ..ఎంతమంది డైరెక్టర్లు ఉన్న ..రాంగోపాల్ వర్మ పేరు చెప్తే వచ్చే ఫీలింగ్ ఏ వేరు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో.. రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని సినిమాలు తీసి హిట్టు కొట్టినా సరే.. రాంగోపాల్ వర్మ కి ఉన్న డేర్ ఏ డైరెక్టర్ కి లేదనే చెప్పాలి . అది పొలిటీషియన్ కాదు సినీ ప్రముఖులు కాదు ..ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లు తూచా తప్పకుండా ముఖానే మాట్లాడేస్తాడు.
రాంగోపాల్ వర్మ అంటే జనాల్లో పిచ్చ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఎప్పటికప్పుడు కాంట్రివర్షియల్ కంటెంట్ ని టచ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉండే రామ్ గోపాల్ వర్మ .. రీసెంట్గా అదిరిపోయే ట్వీట్ చేశాడు . అయితే ఏమైందో ఏమో కానీ ట్వీట్ పెట్టిన కొన్ని క్షణాల్లోనే డిలీట్ చేశారు . అయితే అప్పటికే స్క్రీన్ షాట్ తీసిన కొందరు ఆకతాయిలు వైరల్ చేస్తున్నారు .
కాగా ప్రస్తుతం డలాస్ లో ఉన్న వర్మ తన చిరకాల కోరికను తీర్చేసుకున్నాను అని “డెలాస్ లో ఉన్న బేబీ డాల్స్ క్లబ్ కి వెళ్ళాను ” అంటూ ట్విట్ చేశాడు. అంతటితో ఆగకుండా ” ప్రపంచంలోని ప్రతి ఒక్క మగాడు బాయ్ డాల్స్ జెంటిల్మెన్ క్లబ్ ని సందర్శించాలి అని.. అలా వెళ్ళని మగాళ్లు అసలు మగాలే కాదు “అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే పెట్టిన కొన్ని నిమిషాలకే వర్మ ఆ ట్వీట్ ని డిలీట్ చేయడం గమనార్హం. అసలు వర్మ ఆ ట్వీట్ ఎందుకు పెట్టినట్టు ..?ఎందుకు డిలీట్ చేసినట్లు ..? అర్థం గాక అభిమానులు బుర్ర పీక్కుంటున్నారు . మొత్తానికి మరోసారి తనదైన స్టైల్ లో రెస్పాండ్ అయి వర్మ సోషల్ మీడియాని షేక్ చేసేసాడు..!!