ఆ స్టార్ హీరోకి దూరం కావడం వల్లే సమంతకి ఇన్ని కష్టాలా..

అగ్ర హీరోయిన్ సమంత తన కెరీర్, పర్సనల్ లైఫ్, హెల్త్ వంటి విషయాల్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయినా అధైర్య పడకుండా వాటిని ఒక్కోటిగా అధిగమిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. విడాకుల విషయంలోనే ఆమె ఇప్పటికే నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. కొన్ని విషయాల్లో ఒకరికొకరు సర్దుకుపోలేక విడిపోయారు. ఆ విడాకులు తనపై ప్రభావం చూపకుండా సమంత చాలానే ప్రయత్నాలు చేసింది. చివరికి మళ్ళీ తన కెరీర్ ను గాడిలో పెట్టుకుంది. ఫ్లాప్స్ ఎదురవుతున్నా ఆమె చలించకుండా ముందడుగులు వేస్తోంది.

అయితే సోషల్ మీడియాలో సమంత విడాకుల గురించి చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. వాటిలో తాజాగా జరుగుతున్న ఒక చర్చ అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే, సమంత నాగచైతన్యను కాకుండా వేరే ఒక స్టార్ హీరోని పెళ్లి చేసుకొని ఉంటే ఆమె లైఫ్ చాలా బాగుండేదని చర్చ జరుగుతోంది. ఆ హీరో మరెవరో కాదు జబర్దస్త్ సినిమాలో సమంతతో కలిసి నటించిన సిద్ధార్థ్. ఈ చాక్లెట్ బాయ్, సమంత కొద్ది రోజులు కలిసి డేటింగ్ చేశారు. జాతకం కలవడం లేదని శ్రీకాళహస్తి కి వెళ్లి పూజలు కూడా చేయించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తర్వాత అతడి వైఖరి నచ్చక సమంత ఛీదరించుకుంది. ఇతడు వేరే హీరోయిన్‌తో కలిసి చీట్ చేస్తూ సమంతకి అడ్డంగా దొరికాడు. అందుకే అతన్ని సమంత వదిలేసింది. అయితే ఒకవేళ సిద్ధార్థ్ చేసిన ఆ తప్పును క్షమించి అతడిని పెళ్లి చేసుకొని ఉంటే వారికి ఒక బాబు లేదా పాప పుట్టి ఉండేదని, వారు ఇప్పటికీ కలిసి ఉండే వారేమోనని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరికొందరు మాత్రం మంచి మనసున్న నాగచైతన్యతోనే విడాకులు అయ్యాయి. అలాంటిది సిద్ధార్థ్ తో పెళ్లి ఐతే ఒక్క నెలలోనే విడాకులు అయ్యుండేవి అని మరికొందరు అంటున్నారు.