మహేశ్ పై పాయల్ నాటీ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంట్రా బాబు..!!

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే పాయల్ రాజ్ పుత్ ఫిజిక్ బాగానే మెయింటైన్ చేస్తూ వస్తుంది . అంతే కాదు డైరెక్టర్స్ ఏం అడిగినా సరే ..నో – కాదు – లేదు అనకుండా విచ్చలవిడిగా ఓపెన్ గా చూపిస్తుంది. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న పాయల్ రాజ్ పుత్ ఎందుకు స్టార్ హీరోయిన్గా మారలేదు అంటే మాత్రం ఆమెకు నటనపై పెద్దగా గ్రిప్ లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.

కాగ రీసెంట్గా పాయల్ రాజ్ పుత్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది . మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “సర్కారు వారి పాట”. ఈ సినిమాను నేను మిస్ చేసుకున్నాను అంటూ చెప్పుకు వచ్చింది . ” ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో నేను మెరవాల్సింది . కానీ ఆమె ఆ ఛాన్స్ కొట్టేసింది . కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో బాగా నటించింది . అయితే నా డ్రీమ్ హీరోతో నటించాలి అనే కోరిక నాకు కోరికగానే మిగిలిపోయింది ..ఆ అవకాశం ఎప్పుడొస్తుందో అంటూ మహేష్ బాబు పై తనకున్న ప్రేమను బయటపెట్టింది .

అయితే అభిమానులకు అర్థం కాని విషయం ఏంటంటే..? మేకర్స్ నిజంగానే కీర్తి సురేష్ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ ని అప్రోచ్ అయ్యారా..? అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. దీనిపై సర్కారీ వారి పాట టీమ్ స్పందించకపోతే బ్యాడ్ కౌంటర్స్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?