జగన్‌పై షా అస్త్రం..బాబుని సెట్  చేసినట్లేనా?

కావాలని టార్గెట్ చేశారా? లేదా జగన్‌ని నిజంగానే ఓడించాలని అనుకుంటున్నారో తెలియదు గాని..తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇంతటి అవినీతి ప్రభుత్వం ఎక్కడ లేదని ఫైర్ అయ్యారు. అంతకముందు బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు జే‌పి నడ్డా సైతం జగన్ ప్రభుత్వం టార్గెట్ గానే విమర్శలు చేశారు. దీంతో జగన్, బి‌జే‌పి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బ్రేక్ అయిందా? బి‌జే‌పి, జగన్ మధ్య గ్యాప్ పెరిగిందా? అనే పరిస్తితి కనిపిస్తుంది.

తాజాగా విశాఖలో షా చేసిన విమర్శలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మోదీ 9 ఏళ్ల పాలన విజయాలని చెబుతూనే..జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని, కేంద్ర పథకాలపై జగన్‌ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని, పేదల కోసం ఇచ్చిన బియ్యాన్నీ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. విశాఖపట్నాన్ని భూ రాబందుల కేంద్రంగా మార్చేశారని, మైనింగ్‌, భూ మాఫియా, గంజాయి స్మగ్లింగ్‌.. ఇలా అన్నిటిలోనూ వైసీపీ నాయకులే ఉంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఔషధాల తయారీలో కూడా కల్తీ జరుగుతోందని ఫైర్ అయ్యారు.

ఇక వరుసపెట్టి రాష్ట్ర బి‌జే‌పి నేతలు సైతం జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఇలా జగన్‌ని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏమైనా ఉందా? అనేడ్ డౌట్ వస్తుంది. ఈ మధ్య కాలంలో వరుసపెట్టి జగన్..బి‌జే‌పి పెద్దలని కలిశారు. అలాగే ఆయనక్ అనుకూలంగా నిధుల విడుదల జరిగింది.

ఇదే సమయంలో ఇటీవల చంద్రబాబు సైతం అమిత్ షా, జే‌పి నడ్డాలతో కలిశారు. దీంతో అక్కడ నుంచి కాస్త సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది. జగన్‌ని అందుకే టార్గెట్ చేశారని అనిపిస్తుంది. చూడాలి మరి ఈ దూకుడు ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేదంటే ఆగిపోతుందో.