ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్న ఎన్టీఆర్.. అసలేం జరిగింది..!

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ – జయలలిత కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన రాజకీయ నేపథ్యం గల సినిమా కథానాయకుడు. ఈ సినిమాలో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ కలిగిన ఓ యువకుడిగా ఎన్టీఆర్ గారు ఉంటారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ ను అభిమానించి, ప్రేమించే అమ్మాయిగా జయలలిత నటించింది.

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే కేవలం జయలలిత మీద షూటింగ్ చేసే పళ్ళు నుంచి పళ్ళు అనే ఒక పాటలో కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది. సినిమా యూనిట్ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఎన్టీఆర్ జయలలిత ఫిబ్రవరి 3 నుండి ఆ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయడం కోసం డేట్స్ ఇచ్చారు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై మరణించారు.

Katha Nayakudu (1969) - IMDb

తమిళనాడు మొత్తం ఒక్కసారిగా ఆయన మరణంతో స్తంభించిపోయింది. ఇక షూటింగులు అన్నీ బంద్ చేసేసారు. అప్పుడు ప్యాచ్ వర్క్ జరగడం చాలా కష్టంగా మారింది. ఎలా అయినా ఆ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలి.. లేకపోతే మళ్లీ ఆరు నెలల వరకు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా లేవు. ఇక అప్పట్లో జయలలిత పాలిటిక్స్ లో కీలక పాత్ర వహించేవారు. ఆమె కచ్చితంగా అన్నాదురై అంత్య‌క్రియలకు వెళ్లి వచ్చి షూటింగ్లో పాల్గొనాలి. ఇక ముఖ్యమంత్రి అంత్యక్రియలు తదనంతరం గోపాలకృష్ణగారు మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే షూటింగ్ సెట్లో మాత్రం ఎన్టీఆర్ మేకప్ వేసుకుని జయలలిత గారి కోసం రెడీగా ఉన్నారు.

ఆయన జయలలిత రావడానికీ ఆలస్యం అవుతుండడంతో గంట గంటకు ఫోన్ చేస్తూ ఉండడంతో ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి చమటలు పట్టాయి. అలా చివరికి మధ్యాహ్నం మూడు గంటలకు జయలలిత షూటింగ్ స్పాట్ కి వచ్చింది. అయితే ఇక మొత్తం 52 బిట్లు షూట్ చేయాలి. ఇక దాంతో ఛాయాగ్రహకుడు వైఎస్ స్వామిని ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ పక్కకు పిలుచుకొని నువ్వు రాత్రి 12 గంటలకు వరకు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తే నీకు కార్ బహుమతిగా ఇస్తానని చెప్పాన‌ట‌.

sr-ntr-and-jayalalitha | తెలుగు360

ఆ ఒక్క మాటతో శరవేగంతో దూసుకుపోయి షూటింగ్ కంప్లీట్ చేశారు స్వామి. అంతేకాకుండా దీనితో పాటు వీరికి జయలలిత … ఎన్టీఆర్ సహాయ సహకారాలు కూడా అందాయి. ఇక అర్ధరాత్రి 12 గంటలకల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇక జయలలిత లేటుగా రావడం కారణంగా ఎన్టీఆర్ అర్ధరాత్రి 12 గంటల వరకు షూటింగ్ చేయక తప్పలేదు. ఇక సినిమా యూనిట్ అనుకున్నట్లే కథానాయకుడు సినిమా ఫిబ్రవరి 27న విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.