గోపీచంద్ `రామ‌బాణం`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `రామ‌బాణం`. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో డింపుల హ‌యాతి హీరోయిన్ గా న‌టిస్తే.. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు.

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు సైతం ఊపందుకున్నాయి. అయితే ఈ సినిమాలో గోపీచంద్‌, జ‌గ‌ప‌తి బాబు అన్న‌ద‌మ్ముల‌గా న‌టించారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రోమోస్ లో చూపించారు.

కానీ, వాస్త‌వానికి గోపీచంద్ అన్న‌య్య పాత్ర‌కు జ‌గ‌ప‌తి బాబు ఫ‌స్ట్ ఛాయిస్ కాద‌ట‌. మొద‌ట ఆ పాత్ర కోసం మేక‌ర్స్‌ ఓ సీనియ‌ర్ స్టార్ హీరోను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న ఈ మూవీని రిజెక్ట్ చేశార‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు రాజ‌శేఖ‌ర్‌. పాత్ర న‌చ్చ‌డంతో ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. అయితే ఏవో కార‌ణాల వ‌ల్ల మ‌న‌సు మార్చుకుని సున్నితంగా చెప్పార‌ట‌. దాంతో ఆ పాత్ర కోసం జ‌గ‌ప‌తి బాబును తీసుకున్నారు. సినిమాలో గోపీచంద్ త‌ర్వాత హైలెట్ అయ్యే పాత్ర జ‌గ‌ప‌తి బాబుదే అని అంటున్నారు.