మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మనోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతడి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు.
పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులైన తర్వాత ప్రణతి రెడ్డి అమెరికా వెళ్లిపోయి అక్కడే ఉంటుంది. ప్రస్తుతం మనోజ్ కూడా సినిమాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా ఈ క్రమంలోనే మనోజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.
దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె అయిన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడి రీసెంట్ గానే వివాహం కూడా చేసుకున్నాడు. ఇక దీంతో మనోజ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ గా మారిపోయాడు. ఇప్పుడు మనోజ్ గురించి సోషల్ మీడియాలో తెగ కామెంట్లు సచ్చలు కూడా జరుగుతున్నాయి.
ఇక ఇప్పుడు మనోజ్ మొదటి భార్య ఏం చేస్తుందో అంటూ చాలా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఆయన మొదటి భార్య ప్రణతి ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. ఆయనతో విడిపోయాక ఆమె ఒంటరిగా ఉంటూ తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుందని తెలుస్తుంది. మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.