ఆ చిత్రాల నుండి కావాలని తప్పించారు భూమిక హట్ కామెంట్స్ ..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ భూమిక చావ్లా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మహేష్ బాబుతో నటించిన ఒక్కడు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత పలు హీరోలతో క్రేజ్ సినిమాలను చేసి తెలుగులో స్టార్ క్రేజ్ను సంపాదించుకుంది భూమిక. అయితే బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో అలరించాలని ఆకట్టుకోవాలని చూసింది కానీ సక్సెస్ కాలేదు.

Bhumika Chawla Says Marriage And Having A Child Affects Film Career
తెలుగులో అగ్ర హీరోలతో నటించి మంచి హిట్లు అందుకున్న భూమిక హిందీలో తొలి సినిమా సల్మాన్ ఖాన్ తో తేరే నామ్ చేసింది. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వటంతో ఒక పెద్ద ప్రొడక్షన్స్ సినిమాలో ఆఫర్ అందుకుంది భూమిక. కానీ ఆ సినిమాకు సైన్ చేశాక ఆఫర్లు వచ్చిన వదులుకుంది. తీరా చూస్తే ఆ సినిమా నుంచి ఆమెను తప్పించారని తెలియజేస్తోంది. మళ్లీ ఏడాది పాటు తను ఏ సినిమా కూడా ఒప్పుకోలేదట.

ఆ తరువాత బాలీవుడ్ లోనే మరో సినిమాలో కూడా తననే హీరోయిన్ గా అనుకొని ఆ సినిమానుంచి తొలగించారని తెలుపుతోంది..ఇదే కాదు జబ్ వి మెట్ చిత్రంలో మొదటగా హీరోయిన్ భూమిక ని అని చెప్పి హీరోగా బాబి డియోల్ చేస్తారని అన్నారట. కానీ ఆ తర్వాత హీరో ప్లేసులో షాహిద్ కపూర్ , హీరోయిన్గా కరీనాకపూర్ ని తీసుకున్నారట .ఆ తరువాత మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు సైన్ చేశాను. ఆ సినిమా నుంచి కూడా తనను తీసేశారు. అలా చాలా చిత్రాలు భూమిక కి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అయితే తన వరకు వచ్చిన ఛాన్సులు ఎందుకు మిస్ అవుతున్నాయో తనకి తెలియటం లేదట. బాలీవుడ్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి భూమిక కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చారు.