`ఏజెంట్` మూవీ కోసం అఖిల్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని అఖిల్ హీరోగా తెర‌కెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర‌ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు.

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం మేక‌ర్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసేందుకు జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక‌పోతే ఈ సినిమాకు అఖిల్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

నిజానికి ఏజెంట్ కోసం అఖిల్ ఇంతవ‌ర‌కు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట‌. ఈ విష‌యమే అంద‌రికీ షాకిస్తోంది. ఈ విష‌యాన్ని నిర్మాత అనిల్ సుంక‌ర స్వ‌యంగా వెల్ల‌డించారు. అయితే ఏజెంట్ నిర్మాణంలో అఖిల్ భాగం అయ్యాడ‌ట‌. రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా దాన్నే పెట్టుబ‌డిగా పెట్టాడ‌ట‌. ఒక‌వేళ సినిమా మంచి విజ‌యం సాధిస్తే.. లాభాల్లో అఖిల్ కు కొంత వాటా వ‌స్తుంద‌ట‌.