షాకింగ్‌: కృష్ణ – విజయనిర్మల అన్నా చెల్లెలుగా నటించిన సినిమాలు ఇవే…!

నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ విషయానికి వస్తే.. కృష్ణ – ఇందిరాదేవితో వివాహం అవ్వగా తర్వాత.. మరో అగ్ర హీరోయిన్ విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నాడు.

Krishna vijaya nirmala : కృష్ణ రహస్య వివాహం.. గుళ్లో పెళ్లి.. భార్య ఉండగా  రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు | Krishna\#39;s secret marriage reasons  for second marriag , super star ...

ఇక కృష్ణ- విజయనిర్మల భార్యాభర్తలు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరూ అన్నా చెల్లెలుగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరిద్దరికీ వివాహం అయిన తర్వాత, అలాగే హీరో హీరోయిన్లుగా నటించాక, మళ్లీ అన్నా చెల్లెలుగా నటించారు. ఇది ఎవరికీ తెలియని మరో విచిత్రం.

Eeenadu Kattukunna Full Video Song || Pandanti Kapuram Movie || Krishna, Vijaya  Nirmala - YouTube

మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా తొలి రోజుల్లో ఎన్నో గొప్ప సినిమాలను రూపొందించారు. ఆయన తొలి సినిమా రాముడు- భీముడు ఈ సినిమాలో నటసార్వభౌమ ఎన్టీఆర్ తో ద్విపాత్ర అభినయం చేయించారు. ఈ సినిమా కన్నా ముందే అనురాగం అనే ఒక సినిమాను కూడా రూపొందించారు రామానాయుడు. ఆయ‌న‌ నిర్మాతగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బొమ్మలు చెప్పిన కథ‌ అనే సినిమాను రూపొందించారు.

bommalucheppinakatha2.jpg

ఈ సినిమా ఏప్రిల్ 4, 1969లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఒకరకంగా జానపద చిత్రం అనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు జి. విశ్వనాథం దర్శకుడుగా వ్యవహరించారు. ఈ సినిమాలో అప్పటి అగ్ర హీరోలు అందరూ నటించారు. ఇదే సినిమాలో కృష్ణ, విజయనిర్మల అన్న చెల్లెలుగా నటిస్తారు. విజయనిర్మల ఇందులో కాంతారావు పక్కన నటిస్తే, కృష్ణ పక్కన గీతాంజలి న‌టించింది.

தெலுங்கு சூப்பர் ஸ்டார் கிருஷ்ணாவின் திரைச் சாதனைகள்!

ఈ సినిమా తో పాటు కృష్ణ విజయ నిర్మల అన్న చెల్లెలు గా నటించిన చిత్రాలు ఇంకో రెండు వున్నాయి. అవి మంచి మిత్రులు’ ‘ముహూర్తబలం’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల అన్నా చెల్లెళ్ళుగా నటించారు. ఆ తరువాత వారిద్దరూ మరెప్పుడూ అన్న చెల్లెలుగా నటించలేదు.