దుబాయ్ లో గ్రాండ్ గా ఉపాస‌న బేబీ ష‌వ‌ర్‌.. వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ ల‌వ‌బుల్ క‌పుల్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న త్వ‌ర‌లో త‌ల్లిదండ్రుల‌గా ప్ర‌మోట్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ శుభ‌వార్త‌ను మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొద‌ల అంద‌రితో పంచుకున్నారు.

దీంతో మెగా అభిమానులు రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ల‌కు పుట్ట‌బోయే బిడ్డ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుకున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా భార్య‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ దుబాయ్ కు వెకేష‌న్ కు వెళ్లిన సంగ‌తి విధిత‌మే. అయితే అక్క‌డ న‌మ్మోస్ క్ల‌బ్ బీచ్ లో ఉపాస‌న బేబీ ష‌వ‌ర్ వేడ‌క గ్రాండ్ గా జ‌రిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఉపాస‌న‌.. `మీ అంద‌రి ప్రేమ‌కు కృత‌జ్ఞాత‌లు. నా లైఫ్ లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా బేబీ ష‌వ‌ర్ వేడుక‌ను చేసేందుకు నా డార్లింగ్ సిస్ట‌ర్స్‌కు థ్యాంక్యూ` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఉపాస‌న పంచుకున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

https://www.instagram.com/reel/CqpQ_vfB7W8/?utm_source=ig_web_copy_link