చిరంజీవి.. ఆ స్టార్ ప్రొడ్యుస‌ర్ కాంబినేష‌న్ వెన‌క ఎవ్వ‌రికి తెలియ‌ని హిస్ట‌రీ ఉందా..!

టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల‌లో ఒకరైన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత సి అశ్వినీ దత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి- అశ్వినీదత్ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక‌టి ప్లాప్ అయ్యింది. అస‌లు వీరి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందం.

Is Prabhas-Nag Ashwin's film a sequel to Chiranjeevi-Sridevi's Jagadeka  Veerudu Athiloka Sundari? - IBTimes India

జగదేకవీరుడు అతిలోకసుందరి:
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి హీరోగా నిర్మాత సి. అశ్వినీ దత్ కలయికలో తొలి సిసిమాగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా వ‌చ్చింది. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి నటించింది. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలు ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయి 33 సంవత్సరాలు పూర్తయింది. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను హిందీలో కూడా డ‌బ్‌ చేశారు. అక్కడ ఆద్మీ ఔర్ అప్సర పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

Watch Choodalani Vundi on ott streaming online

చూడాలని వుంది:
వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ చూడాలని వుంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అంజలా జవేరి – సౌందర్యలు హీరోయిన్ గా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేశారు. మ‌ణిశ‌ర్మ పాట‌లు గుణ‌శేఖ‌ర్ టేకింగ్, చిరు డ్యాన్సులు అప్ప‌ట్లో హైలెట్‌. 63 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

Vyjayanthi Movies delaying Indra's release for this reason? -  TeluguBulletin.com

ఇంద్ర:
చిరంజీవి – వైజయంతి మూవీస్ బ్యానర్ లో మూడో సినిమాగా ఇంద్ర సినిమా వచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు బి.గోపాల్. చిన్ని కృష్ణ కథ అందించారు. ప‌రుచ‌రి బ్రదర్స్ మాటలు రాశారు. ఈ సినిమాకు మణి శర్మ స్వరాలు ఇవ్వ‌గా, ఒక పాటకు ఆర్పి. పట్నాయక్ సంగీతం అందించారు. చిరంజీవి సర‌స‌న‌ సోనాలి బింద్రే ,ఆర్తి అగర్వాల్ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2002లో వ‌చ్చిన ఈ సినిమా 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

Amazon.in: Buy Jai Chiranjeeva DVD, Blu-ray Online at Best Prices in India  | Movies & TV Shows

జై చిరంజీవ:
అశ్విని దత్ – చిరంజీవి కాంబోలో వచ్చిన నాలుగో సినిమా జై చిరంజీవ. ఈ సినిమాకు కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్‌గా మిగిలిపోయింది. ఓవ‌రాల్‌గా ఈ కాంబోలో వ‌చ్చిన నాలుగు సినిమాల‌లో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక్క సినిమా మాత్ర‌మే ప్లాఫ్ గా నిలిచింది. మొత్తంగా వీళ్ళ కలయికలో వచ్చిన చిత్రాల్లో 90 శాతం సక్సెస్ సాధించాయి.