వసుంధరకు ఎంతో ఇష్టమైన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..!

సీనియర్ హీరో బాలకృష్ణ తన సినిమా పొలిటికల్ లైఫ్ లో కుటుంబాన్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయరు. ఈ సూత్రాన్ని ఆయన తన తండ్రి ఎన్టీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నారు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు వారసులు ఏనాడు కూడా ఆయన రాజకీయ వ్యవహారాల్లో తలదొరచలేదు వీరంతా ఎన్టీఆర్‌కు రాజకీయపరంగా పూర్తి దూరంగా ఉండేవారు. ఇక ఇప్పుడు బాలయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఏనాడు బాలయ్య పదవిని అడ్డం పెట్టుకుని పైరవీలు చేయలేదు.

అలాగే బాలయ్య సినిమా జీవితంలోనూ వారు కనిపించరు.. బాలయ్య వ్యక్తిగత జీవితం మీరు, సినిమా రాజకీయ జీవితం వేరుగా కనిపిస్తుంది. ఇక బాలయ్య భార్య వసుంధర పూర్తిగా గృహిణిగా మాత్రమే ఉన్నారు. వసుంధర వ్యక్తిగత జీవితం గురించి కూడా బయటకు ఎప్పుడు ఏ సమాచారం ఉండదు. అయితే బాలయ్య నటించిన సినిమాలను వసుంధర అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు.

ఈ సినిమాలలో ఆమెను బాగా మెప్పించే సినిమాలు ఏవి అన్న విషయాన్ని కూడా ఎవరు బయట పెట్టలేదు. బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా మాత్రం వసుంధరకు బాగా ఇష్టం అట. ఈ విషయాన్ని చెన్నకేశవరెడ్డి దర్శకుడు వి.వి వినాయక్ ఓ సందర్భంలో చెప్పడంతో అందరికీ తెలిసింది. చెన్నకేశవరెడ్డి సినిమా షూటింగ్ జరిగే రోజులో బాలయ్య ఇంటికి వెళ్లి ఆ సినిమా షూటింగ్ ముచ్చట్లను వసుందరితో పంచుకునే వారట. అలాగే ఆ షూటింగ్ జరిగిన్నిరోజులు ఇంట్లో కూడా చాలా ఉత్సాహంతో ఉండేవారని వసుంధర గారు తనతో చెప్పారని వినాయక్ తెలిపారు.

ముఖ్యంగా ఆ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణ గెటప్ ఆ లుక్ తనకు బాగా నచ్చాయని.. ఆయనను చాలా బాగా చూపించారని వసుంధర గారు తనతో అనటం తాను ఎప్పటికీ మర్చిపోలేని ప్రశంస అని కూడా వినాయక్ చెప్పారు. ఇక ఈ సినిమాలో తండ్రి పాత్ర తనకు బాగా నచ్చిందని వసుంధర గారు చెప్పారని వినాయక్ తెలిపారు. 2002లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా ఆ రోజుల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. దాదాపుగా 150 కేంద్రాల్లో అర్థశాస్త్ర దినోత్సవ జరుపుకున్న ఈ సినిమా 42 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది.