నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.. అక్కడ ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయగా వీర సింహారెడ్డి ట్రైలర్ కు రికార్డు స్థాయిలో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లోనే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో రెండు లుక్స్‌లో కూడా బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్రాక్‌లో జయమ్మ పాత్రలో మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో అంతకుమించి భయపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా డైలాగ్స్ కూడా అదిరిపోయే రీతిలో ఉంటాయని అర్థమవుతుంది. డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా పనితనం ట్రైలర్ ద్వారానే అర్థమవుతుంది. అఖండ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో బాలయ్య ఈ సినిమా కోసం మరింత కష్టపడి నటించాడు.
అయితే ట్రైలర్ లో కూడా కథ గురించి ఏం మాత్రం స్పష్టత లేదు. అందులో పెద్ద బాలయ్య పాత్ర విదేశాలకు ఎందుకు వెళ్తుందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అయితే ఈ కన్ఫ్యూజన్ సినిమాకు ప్లస్ అవుతుందని కామెంట్లు కూడా వస్తున్నాయి. వీర సింహారెడ్డి అడ్వాన్స్ బుకింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యే అవకాశం అయితే ఉంది.
ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్, హనీ రోజ్ నటించారు. అయితే ఇందులో శృతిహాసన్ క్యారెక్టర్ మాత్రం ఒక ఇంత కామెడీ టచ్ తో ఉండబోతుందని సమాచారం. ఇక ఇద్దరి ముద్దుగుమ్మలకు ఈ సినిమా ఖచ్చితంగా ప్లేస్ అవుతుందని కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ సినిమాతో బాలకృష్ణ ఆఖండను మించి సూపర్ సక్సెస్ సాధించి బాక్స్ ఆఫీస్ కు మరోసారి తన మాస్ పవర్ చూపించబోతున్నారని సమాచారం.