బ్లాక్ సూట్ లో సూపర్ కూల్ గా చరణ్ … మెగా ఫ్యాన్స్ ఫిదా..!

మెగాస్టార్ వార‌సుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్ అతి త‌క్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌త సంవ‌త్స‌రం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో త‌న కేరీర్‌లోనే తోలి పాన్ ఇండియా విజ‌యం అందుకున్ని వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పొలిటికల్ సబ్జెక్టు ని చరణ్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమా కోసం ప్రిపేర్ చేస్తున్న ఒకో లుక్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి లేటెస్ట్ గా ఇప్పుడు చరణ్ లూయిస్ వుంటాన్ అవార్డ్స్ వేడుకకు గాను కాలిఫోర్నియా లో ల్యాండ్ అయ్యాడు. అక్క‌డ చరణ్ మరోసారి తన లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. బ్లాక్ కలర్ ట్రెండీ సూట్ లో రామ్ చరణ్ చాలా కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

దీంతో ఆ పిక్స్ నెట్టింట మ‌రోసారి వైరల్ అవుతున్నాయి. మరి ఈ వేడుక తర్వాత మళ్ళీ చరణ్ శంకర్ సినిమా షూటింగ్‌ లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.