హీరోయిన్ జయసుధ రెండో పెళ్లిపై అసలు విషయం ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోఒకప్పటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో అందరి హీరోల సరసన నటించి సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది జయసుధ. ఇప్పట్లో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పేరును సంపాదించుకుంది. కొందరికి హీరోయిన్ వరకే అవకాశాలుంటాయి. కానీ ఈమెకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం వచ్చింది. ఈమె వయస్సు తగ్గట్టుగానే ఈమెకి తల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇది కాస్త పక్కన పెడితే ఈ మధ్యకాలంలో జయసుధ భర్త మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.

Jayasudha reacts on not getting 'Padma Shri' yet

జయసుధ భర్తని కోల్పోవడంతో ఒంటరిగా కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఇప్పుడిప్పుడే తన భర్త చనిపోయిన జ్ఞాపకాలను మర్చిపోతూ సినిమాలతో బిజీగా గడుపుతున్న సమయంలో రెండో పెళ్లికి సిద్ధపడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకొంతమంది అయితే జయసుధకు ఆల్రెడీ వివాహమయ్యింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.చాలామంది ఈ వార్తపై స్పందిస్తూ జయసుధ పై ఫైర్ అవుతున్నారు. ఆమె వయస్సు 67 ఏళ్లు ఈ వయస్సులో రెండో పెళ్లికి సిద్ధపడటం ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఈ వార్తా ను ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై జయసుధ స్పందించి ఎవరో నేనంటే గిట్టని వారు తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అని ఆమె ఫైర్ అవుతోంది.

తన భర్త చనిపోయినప్పటి నుంచి తను సినిమాలతో బిజీగా ఉంటూ ఒంటరితనం అనే బాధ నుంచి ఉపశమనం పొందుతున్నట్లు ఆమె తెలిపింది. అలాగే తన గురించి ఎందుకు ఇలా బ్యాడ్ ప్రచారాలు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో వచ్చే తన పెళ్లి వార్తలు తనని మానసికంగా కృంగదీస్తున్నాయని ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు అని అసహనం వ్యక్తం చేసింది జయసుధ. దీంతో ఎట్టకేలకు ఏమి వివాహం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది.