భారీగా పెంచేసిన సీనియర్లు..యువ హీరోలను మించిపోయారుగా అంతేగా మరి..!

ప్రస్తుతం మన టాలీవుడ్‌లో యువ హీరోలు కన్నా సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నా యంగ్‌ హీరోలకు పోటీగా సినిమాలు చూస్తున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ- చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాగా.. ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

List of Senior Telugu heroes Million Dollar movies in USA

ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి బోళా శంకర్ అంటూ పలు సినిమాలో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాలకృష్ణ కూడా అఖండ సక్సెస్ తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకున్నాడు. బాలయ్య ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా అన్ స్టాపబుల్ షో తో అదరగొడుతున్నాడు.
మరో సీనియర్ హీరోలైన వెంకటేష్, నాగార్జునలు కూడా వరుస‌ సినిమాలు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు.

ఇక ఇప్పుడు ఈ సీనియర్ హీరోలు కూడా యువ హీరోలతో పోటీగా తమ రెమ్యూనిరేషన్లు భారీగా పెంచినట్టు తెలుస్తుంది. చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తన రెమ్యూనిరేషన్ విపరీతంగా పెంచాడు. రూ.50 కోట్ల మేర రెమ్యూనిరేషన్ అందుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న బోగట్ట. ఇటు బాలయ్య కూడా అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు.

Rejected by Venkatesh, Accepted by Ravi Teja

ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల మేర రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న బాలయ్య.. ఇక ఇప్పుడు తన రెమ్యూనిరేషన్‌ను రూ.20 కోట్లకు పెంచినట్టు తెలుస్తుంది. మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక గత సంవత్సరం ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ ఆ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా దగ్గర నుంచి వెంకటేష్ తన ప్రతి సినిమాకు రూ.15 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Senior Star heroes Takes Sensational Decisions సీనియర్లు అయినా భలే కష్టపడుతున్నారు!

గత సంవత్సరం చివరిలో ధమాకా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నా రవితేజ కూడా తన రెమ్యూనిరేషన్‌ను భారీగా పెంచినట్టు తెలుస్తుంది. ఏకంగా సినిమాకు రూ.25 కోట్ల మేర రెమ్యూనిరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ రకంగా టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలు అందరూ తమ రెమ్యూనిరేషన్‌ను భారీగా పెంచేశారు. వీరిలో ఒక నాగార్జున మాత్రమే ఇందులో వెనుకబడ్డాడు. తన ఒక్కో సినిమాకు నాగార్జున రూ.10 కోట్ల మేర రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ రకంగా టాలీవుడ్ సీనియర్లు అందరూ ఒక్కసారిగా సూపర్ ఫామ్ లో యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు.