హ్యాట్రిక్ కు సిద్ధ‌మైన ర‌వితేజ.. `రావణాసుర` గ్లింప్స్ అదిరిపోయిందిగా!

మాస్ మహారాజా రవితేజ ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కు సిద్ధమవుతున్నాడు. ఈయ‌న‌ నుంచి త్వరలోనే `రావణాసుర` అనే సినిమా రాబోతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. సుశాంత్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. యూనిక్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 ఏప్రిల్‌ 7న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. అయితే నేడు ర‌వితేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేక‌ర్స్ రావ‌ణాసుర గ్లింప్స్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఈ గ్లింప్స్ థీమ్ మ్యూజిక్ మొదలవగా బ్లాక్ సూట్ ధరించి రవితేజ స్టైల్ గా నడుచుకుంటూ వెళుతున్న విజువల్స్ ను చూపించారు. మరో చోట టాప్‌ పై ఓ యువతి శవం.. మరో చోట వర్షం కురుస్తుండగా రోడ్డుపై హత్యకు గురైన యువతి బాడీ..మరో యువతిని బెడ్ పై హత్య ప్రయత్నం వంటి విజువ‌ల్స్ ను చూపిస్తూ సినిమాపై ఆస‌క్తిని రేకిత్తించారు. రవితేజ డిఫరెంట్ లుక్ లో ఆక‌ట్టుకున్నాడు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ గ్లింప్స్ అదిరిపోయింది. అలాగే సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది.