చిరు ‘ వాల్తేరు వీరయ్య ‘ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. భారీ ఓపెనింగ్స్ కూడా కష్టమేనా..!

ఇక సంక్రాంతి పండుగకు మరికొద్ది రోజుల సమయం ఉండడంతో సినిమాల విడుదల తేదిలపై క్లారిటీ వచ్చేసింది. ముందుగా జనవరి 11న విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తర్వాత రోజు జనవరి 12న నట‌సింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, ఇక తర్వాత రోజు జనవరి 13న చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి.

అయితే ఒకేసారి ఇన్ని స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల కొరత కారణంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టుగల స్టామినా చిరంజీవికి సొంతం పైగా ఈసారి ఆయనకు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

Waltair Veerayya: మాసీవ్ లుక్ లో మెగాస్టార్.. పునకాలు లోడింగ్

ఇక దీంతో ఈ సినిమాకు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మాత్రం వాల్తేరు వీరయ్య సినిమాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం దిల్ రాజు నిర్మాతగా వస్తున్న వారసుడు సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

Waltair Veerayya | వాల్తేరు వీరయ్య కోసం వస్తున్న బాలకృష్ణ.. క్రేజీ టాక్‌లో  నిజమెంత..?

ఇక ముందుగా వారసుడు, తెగింపు సినిమాలు జనవరి 11న రావడంతో నైజం, ఉత్తరాంధ్రలోని మెజార్టీ థియేటర్లో ఆయన సినిమాలకే కేటాయించాడు. ఇక మిగిలిన థియేటర్లో వీర‌ సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పంచుకున్నాయి. అందులోనూ వీర సింహారెడ్డి ఒకరోజు ముందు రావడంతో వాల్తేరు వీరయ్య థియేటర్లు కూడా బాలయ్యకు కలిసి వచ్చి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే వాల్తేరు వీరయ్య పరిస్థితి మాత్రం వేరు. అసలే థియేటర్లో తక్కువ అంటే.. దానికి తోడు రిలీజ్ అయిన రోజు నుంచి వీర‌సింహారెడ్డి తో కలిసి థియేటర్లో పంచుకోవాల్సి ఉంటుంది. ప్రేక్షకులకు వాల్తేరు వీరయ్య సినిమా చూడాలని ఉన్న థియేటర్లు అందుబాటులో ఉండవు.. ఈ విధంగా ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్ కు భారీ దెబ్బ తగలనుంది.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య వయసెంతో కనిపెట్టలేమయ్య.. చిరు లుక్స్‌‌కి  ఫ్యాన్స్ ఫిదా

అలాగే బాలయ్య వీర సింహారెడ్డి సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా పరిస్థితి కొంత మెరుగ్గా ఉండొచ్చు అని చెబుతున్నారు. ఇక ఈ విధంగా ఈ సినిమాలలో చిరంజీవి సినిమాకు మాత్రం భారీ స్థాయిలో బొక్క పడిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాల్లో ఏ సినిమా ఘనవిజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.