జగపతిబాబు తల్లి మాట కోసం ఆ పని చేస్తున్నారు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటుడుగా గుర్తింపు పొందిన జగపతిబాబు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించారు. ఇక గతంలో ఎన్నో సినిమాలలో నటించి బాగా పాపులర్ అయిన జగపతిబాబు ఆ తర్వాత కొన్ని సినిమాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్గా రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విలన్ గా నటించడమే కాకుండా ఫాదర్గా కూడా బాగా ఆకట్టుకున్నారు.

कचरा बीनने वालों की मदद करेगा ये साउथ स्टार, गरीब लड़की को बनाएगा IAS; TV  पर कहानी देख दिखाई दरियादिली - south actor jagapathi babu lends helping  hand to ragpickers daughter ...
తాజాగా జగపతిబాబు ఒక పేద విద్యార్థికి చేసిన సాయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. సైదాబాద్కు చెందిన జయలక్ష్మి అనే విద్యార్థికి జగపతిబాబు అండగా నిలవడమే కాకుండా వరల్డ్ చిల్డ్రన్ పార్లమెంట్ ప్రధానిగా ఆమె వ్యవహరిస్తోంది. డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యల పైన పోరాటం చేస్తూనే.. ఆమె సివిల్స్ చదవాలని కోరికగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్థిక సమస్యల వల్ల ఆమె ఇబ్బంది పడుతోందని ఆమె తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడుతున్నారనే విషయాన్ని ప్రముఖ దినపత్రికలో ఆర్టికల్ ద్వారా జగపతిబాబు తల్లి ఈ విషయాన్ని తెలుసుకున్నారట.

Jagapathi Babu who showed big heart | Vaarthaఈ విషయం చదివిన జగపతిబాబు తల్లి ఆమెకు సహాయం చేయాలని జగపతిబాబుకు సూచించిందట .ఇక అమ్మ అడిగితే కాదనకుండా వెంటనే ఆమెకు సహాయం చేస్తానని తన తల్లికి మాట ఇచ్చారట. అలా జయలక్ష్మి కి అండగా నిలుస్తూ ఉన్నారు. జగపతిబాబు, జయలక్ష్మి ప్రస్తుతం సివిల్ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని.. ఆమే కష్టపడి చదవాలని ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది జగపతిబాబు.