చిరు చెప్పిందే నిజం….వీరయ్య పరమ బోర్‌..!

చిరంజీవి సినిమా అంటేనే అభిమానులకు అదోరకమైన ఆనందం ఉత్సాహం. పోస్టర్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా ఏదైనా అప్డేట్ వస్తే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతారు. సినిమా ఎప్పుడు ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆ జోష్ లేదు. రాజకీయాల నుంచి సినిమాలకు కంబ్యాక్ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ కమర్షియల్ విజయం అందుకునీ తన రేంజ్ ను నిరూపించుకున్నాడు.

కానీ ఈ సినిమా తర్వాత‌ వచ్చిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో డెంటిస్ఫైండ్ చేశాయి. గత సంవత్సరం వచ్చిన ఆచార్య సినిమా అయితే చిరంజీవి కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఇక మంచి టాక్ వచ్చిన సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాలకు ఆశించిన కలెక్షన్లు అందుకోలేకపోయాయి. సినిమాలకు ముందు వచ్చిన హైప్‌ ఇప్పుడు పక్కన పెడితే ఇవి మెగాస్టార్ రేంజ్ కాదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాల్తేరు వీరయ్య సినిమాతో వస్తున్నాడు చిరు.

Waltair Veerayya Trailer | Megastar Chiranjeevi | Ravi Teja | Bobby Kolli |  Shruti Haasan | DSP - YouTube
ఇక ఈ సినిమా దర్శకుడు బాబి తాను పదే పదే మెగాస్టార్ వీర అభిమాని 25 ఏళ్ల క్రితం థియేటర్లో ఉగిపోయిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా రూపొందించానని దర్శకుడు బాబి చెప్పిన సంగతి ఇంకా అలాగే ఉంది. అయితే దర్శకుడు అన్నట్టుగానే అదే కాలం నాటి స్టాఫ్ తో వీరయ్యను నింపేశాడు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల చేయగా ఇక అందులో డ్రగ్స్ దందా చేసే ఒక మాఫియా, సముద్రం మీద ఆధారపడుతూ లైఫ్‌ని జాలీగా గడిపే హీరో, కొన్ని అనుకోని సంఘటన తర్వాత ఇద్దరి మధ్య క్లాష్‌, ఇద్దరు ఛాలెంజ్ లు చేసుకునీ నువ్వా నేనా అని తలపడటం ఇప్పటికే మనం ఇలాంటి సినిమాలు చాలాసార్లు చూశాం.

ఈ ట్రైలర్ లో ఎంత కాదనుకున్నా చాలా సినిమాల షేడ్స్‌ కనిపించాయి. ఎక్కడో మారుమూల అడవిలో ఓ డెన్, హీరో చుట్టు కామెడీ గ్యాంగ్, సముద్రంలో చేపలు పట్టే కదా నాయకుడు వృత్తి గతంలో చూడనిది కాదు. ఇదే బాబీ తీసిన వెంకీ మామలో వెంకటేష్ ట్రాక్టర్ ని గాల్లో ఎగిరించి ఎటాక్ చేస్తే ఇందులో ఏకంగా ఏనుగు మీద చిరు వెళ్లి బాబీ సింహాతో తలపడతాడు. ఇక శృతి హాసన్ తో లవ్ కమ్‌ కామెడీ ట్రాక్ గతంలో వ‌చ్చిన చిరు సినిమాల మాదిరిగానే ఉంది. ఈ బాడీ లాంగ్వేజ్ ని చూసి చాలా కాలమవ్వడం ఒకటే కొంచెం కొత్తగా అనిపించేది. ఇవన్నీ పక్కనపెడితే చిరంజీవి- రవితేజల మాస్ మెగా కాంబో మాత్రం కోంత కోత్త‌ ఉంది.

Tollywood's 1st big 2023 release: 'Waltair Veerayya' on Jan 13

ఈ ఇద్దరు మధ్య వచ్చే డైలాగ్ లు కూడా వారి సూపర్ హీట్‌ సినిమాలలో వచ్చిన వాటినినే రివ‌ర్స్‌లో చెప్పడం కొంత ఫ్యాన్స్ కు విజిల్స్ వేయించే మాదిరిగా ఉంటుంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్న ట్రైలర్‌లో చూపించినవన్నీ సగటు అభిమానికి నచ్చవచ్చు కానీ.. సగటు ప్రేక్షకుడి కోణంలో చూస్తే భారీగా ఉన్న యాక్షన్ విజువల్స్ తప్ప స్టోరీ పరంగా అంత గొప్పగా అనిపించే అంశాలు ఉండవని అర్థమవుతుంది. వీరసింహారెడ్డి సీరియస్ ఫ్యాక్షన్ డ్రాప్ తో బాలయ్య, వాల్తేరు వీరయ్య కామెడీ ఫైట్లు మసాలాతో చిరంజీవి ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.