ఇంట్రెస్టింగ్: మిల్క్ “బ్యూటీ” సీక్రెట్స్ తెలిస్తే షాక్..!

చిత్ర పరిశ్రమవ‌కు వచ్చి దాదాపు పది సంవత్సరాల కాలం అవుతున్న తమన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. తమన్నా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరితో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. ఇప్పటికీ ఈమె తన అందంతో యువతను కట్టిపాటిస్తుంది. ఈమె సోయగాలు చూసి మై మరిచిపోని అభిమానులు ఉండరు. ఇక ఇప్పుడు తాజాగా తన అందాల రహస్యాన్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

నా అందం వెనుక సీక్రెట్ అదే.. పెద్ద రహస్యం చెప్పేసిన మిల్కీ బ్యూటీ |  Tollywood Star Heroine Tamannaah Beauty Secret Reveal Details, Tamannaah  Bhatia, Tollywood, Tamanna Fans, Tamannah, Tamannah ...

తను ప్రతిరోజు గంధం, కాఫీ పొడి తేనే కలిపి ముఖానికి రాసుకుంటానని చెప్పుకొచ్చింది. దీంతోపాటు తన తల్లి చెప్పినన కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా పాటిస్తానని చెప్పుకొచ్చింది. ఇక తమన్నా బ్యూటీ టిప్స్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం తన ప్రేమ గురించి చెప్పకుండా ఇలాంటి బ్యూటీ టిప్స్ చెబుతుందంటూ కామెంట్లో పెడుతున్నారు.

Tamannaah Bhatia-Vijay Varma dating rumours gain steam after video goes  viral | Entertainment News,The Indian Express

తమన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా తమన్నా బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అందాలకు సంబంధించిన చిట్కాలు చెప్తుందంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీంతో తమన్నా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.