జగన్‌పై బాలయ్య పంచ్‌లు పేలిపోయాయ్‌… వీర‌సింహారెడ్డిలో వాయి తీసేశాడుగా…!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా ఈరోజు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ట్రైలర్లతో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వడంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైరికల్ గా డైలాగ్‌లు పేల్చాడు. . ‘‘నువ్వు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’.. అనే ట్రైలర్లు వచ్చిన డైలాగ్‌ వినగానే బాలయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడని అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇక టైలర్ తోనే సినిమాలు మరిన్ని పంచులు ఉంటాయని సంకేతాలు బాలయ్య ఇచ్చేశాడు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే వీరసింహారెడ్డిలో జగన్ సర్కార్ పై బాలయ్య అదిరిపోయే పంచ్‌ల వర్షం కురిపించాడు. అందులో ఎక్కడా పేర్లు ప్రస్తావించకపోయినా.. జగన్ టీమ్‌కు గట్టిగా తెగిలేలా ఈ సినిమాలో డైలాగులు చెప్పుకోవాల్సిన సంఖ్యలో ఉన్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్ ముందు వచ్చే ఓ సీన్లో అయితే.. అదిరిపోయే డైలాగులతో బాలయ్య వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేశాడు.

Balakrishna explodes on Jagan, Will Jagan dare? | cinejosh.com

ఆ డైలాగులు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దగ్గరగా ఉన్నాయి. ఇక ఆ సీన్ లో హోమ్ మినిస్టర్.. మేం చేస్తున్న అభివృద్ధి కనిపించలేదా అంటాడు. దానికి బదులుగా బాలయ్య గట్టిగా నవ్వి.. ‘‘ఏది అభివృద్ధి? ప్రజలకు మంచి చేస్తే అభివృద్ధి వాళ్లను వేధించడం ఏం అభివృద్ధి? కొత్త పరిశ్రమలు స్థాపించడం అభివృద్ధి.. మూసేయడం అభివృద్ధా? కొత్త భవనాలు నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం అభివృద్ధా? జీతాలు టైంకి ఇవ్వడం అభివృద్ధి.. బిక్షం వేసినట్లు వేయడం అభివృద్ధా..’’ అంటూ బాలయ్య జగన్ సర్కార్ కు సూటిగా తెగలేలా పంచ్‌లు పేల్చాడు.

జగన్ అభిమానుల్ని రెచ్చగొట్టేలా వీర సింహారెడ్డి డైలాగ్స్.. | veera simha  reddy dialogues targets ap cm jagan

ఈ సీన్ రావడానికి ముందు మంత్రుని కలవడానికి బాలయ్య వెళ్ళుతుంటే ఆ వెధవను మీరు కలవడం ఏంటని పక్కనున్న పాత్ర బాలయ్యతో అంటే.. ప్రజలు వెధవలకి అధికారం ఇచ్చారు.. కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అంటూ ఇన్ డైరెక్ట్ గా మరో సెటైర్ వేశాడు. ఇలా చెప్పకుంటే పోతే ఈ సినిమాలో జగన్ సర్కార్నుర్‌ను కౌంటర్ చేసే డైలాగులు చాలానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ డైలాగ్‌లపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.