వీర సింహారెడ్డి: చిరంజీవి వీరయ్య ఆ మార్కును టచ్ చేసేనా..!

బాలయ్య- చిరంజీవి సంక్రాంతి సినిమాల వార్ అంటే మామూలుగా ఉండదు.. ఈ ఇద్దరు విడివిడిగా వస్తే ఎలా ఉంటుందో కానీ ఇద్దరు పోటా పోటీగా వస్తుంటే వేడి మామూలుగా ఉండదు. రెండు రోజుల ముందుగానే బాలయ్య తెలుగువారికి సంక్రాంతి పండగ తీసుకొచ్చేశాడు. ఈరోజు విడుదలైన వీర సింహారెడ్డి సినిమా విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ బజ్‌ను క్రియేట్ చేసుకుంది.

చిరు వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే రేపు ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు మాత్రం సోషల్ మీడియాలో అనుకున్నంత స్థాయిలో బ‌జ్‌ రాలేదు. ఇప్పుడు దీంతో ఎక్కడ చూసినా యుఎస్ నుంచి అమలాపురం వరకు జై బాలయ్య నినాదాలు మారుమోగాయ్‌. దీంతో వీర సింహారెడ్డి ముందు వీరయ్య తక్కువగానే కనిపిస్తున్నాడు. ఇక టాలీవుడ్‌లో ఉన్నా అగ్ర నిర్మాతలు హీరోలు అందరూ కూడా బాలయ్య సినిమాను తెల్లవారకముందే బెనిఫిట్ షోలకు హాజరయ్యారు. హైదరాబాదులో ఉన్న మల్టీప్లెక్స్ అన్నిటిలోనూ చిత్ర పరిశ్రమంలో ఉన్న వారందరూ టికెట్లు కొనేయడం విశేషం. కానీ చిరు వీరయ్య సినిమాకు బెనిఫిట్ షో వేసేవారే కనిపించడం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా దీనికి మించిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. హైదరాబాద్ తో పోల్చుకుంటే వీరయ్య పరిస్థితి కొంచెం బెటర్ గా ఉంది. కానీ అక్కడ కూడా బాలయ్య సినిమా విషయంలో రాజకీయ హడావిడి ఎక్కువగా ఉంది. దీంతో చిరంజీవి ఇక్కడ కూడా తేలిపోయాడు. ఇప్పుడు బాలయ్య నైజాంలో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసే విధంగా దూసుకుపోతున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ తో పాటు రివ్యూలు కూడా రావటంతో ఈ సినిమాకు ఇది ప్లస్ గా కనిపిస్తుంది. ఈ విషయంలో మెగాస్టార్- బాలయ్యను తట్టుకోవటం కష్టమే అనిపిస్తుంది.

Chiranjeevi's Waltair Veerayya or Balakrishna's Veera Simha Reddy: Which  trailer looks promising? | PINKVILLA

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా కూడా హీరోలు వారీగా విడిపోయారు.. చిరు ఫ్యాన్స్ అంతా 50 ప్లస్ వారు అయిపోయారు వాళ్ళు సోషల్ మీడియా హడావిడి కి దూరంగా ఉండేవారు. దీంతో చిరంజీవి సోషల్ మీడియాలో తన హవాని కొనసాగించలేకపోతున్నారు. కానీ నందమూరి ఫ్యాన్స్ యునైట్ గా ఉన్నారు. బాలయ్య అయినా ఎన్టీఆర్ అయినా కలిసి కట్టుగా ఉన్నారు. అదే వారికి ప్లస్ పాయింట్. వీరయ్య సినిమా యునానిమస్ టాక్ తెచ్చుకుంటేనే ఈ ధాటిని తట్టుకోగలదు. లేదంటే కష్టం కావచ్చు.