ఒక్క మల్టీఫ్లెక్స్‌.. రోజులో 35 షోలు.. బాల‌య్య అరుదైన ఘ‌న‌త‌!

నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి నేడు `వీర సింహారెడ్డి` అనే మాస్‌ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా విడుదల అయింది.

ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. క‌థ‌, క‌థ‌నం రోటీన్ గా ఉన్నా.. పాట‌లు, ఫైట్లు, ఎలివేష‌న్లు, డైలాగులు, హీరోయిన్ల‌తో రొమాన్స్‌, ఎమోష‌న్ ఇవ‌న్నీ వీర సింహారెడ్డిలో దండిగా ఉండ‌టంతో సినిమాకు పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. బాల‌య్య మ‌రోసారి త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించారు. దీంతో థియేట‌ర్స్ లో వీర సింహారెడ్డి మోత మోగిపోతోంది. ఇక‌పోతే తాజాగా ఏ అగ్రహీరో సినిమాకు లేని విధంగా ఒక అరుదైన రికార్డును బాలయ్య ఖాతాలో ప‌డ‌బోతోంది.

విష‌యం ఏంటంటే.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల‌కు మొదటి రోజున ఆరు షోలు వేసుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో హైదరాబాద్ లోని పలు మల్టీ ఫ్లెక్సుల్లో ఉదయం 4.30 గంటల నుంచే షోలు స్టార్ట్ అయ్యాయి. అయితే కుకట్ పల్లిలోని సుజనా ఫోరం మాల్ లో మొత్తం తొమ్మిది స్క్రీన్లు ఉంటే.. అందులో ఎనిమిది స్క్రీన్లలో ఉదయం 4.30 గంటల నుంచి 15 నిమిషాల గ్యాప్ తో షోలో వేయటం షురూ చేశారు. దీంతో ఈ ఒక్కరోజులోనే 35 షోలో ఆ మల్టీ ఫ్లెక్సుల్లో పడనున్నాయి. ఇలాంటి అరుదైన ఘ‌న‌త‌.. అందులోనూ సంక్రాంతి వంటి స‌మ‌యంలో ఆ ఆగ్రహీరోకు ద‌క్క‌లేదు. కేవ‌లం బాల‌య్య‌కు మాత్ర‌మే ఇది సాధ్య‌మైంది.