`నాటు నాటు` పాట‌కు స్టెప్పులేసిన రాజ‌మౌళి-కీరవాణి.. వీడియో వైర‌ల్!

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును `ఆర్ఆర్ఆర్‌` సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును తీసుకున్నారు.

ఆసియా నుండి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న తొలి పాటగా `నాటు నాటు` నిల‌వ‌డంతో.. చిత్ర టీమ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. పోటీగా మరో 14 పాటలు నిలిచినా ఈ అవార్డు `నాటు నాటు`కే ల‌భించింది. దీంతో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తున్నారు.

ఇక హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ల‌భించ‌డంతో రాజమౌళితో పాటు కీరవాణి సైతం నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం `నాటు నాటు` పాట‌ను రాజ‌మౌళి, కీర‌వాణి వెర్ష‌న్ లో ఓ చూపు చూసేయండి.

https://www.instagram.com/reel/CnRrv0vs_ik/?utm_source=ig_web_copy_link