పవిత్ర లోకేష్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీకు ఈ విషయాలు తెలుసా..

గత ఏడాది వరకు ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ సినిమాల్లో తప్ప మిగతా మీడియాలో ఎప్పుడూ కనిపించేది కాదు. కానీ నరేష్‌తో ఆమెకు అఫైర్ ఉందన్న వార్తలు మొదలైన సమయం నుంచి ఆమె రోజూ వార్తల్లో నిలుస్తోంది. పవిత్ర లోకేష్‌కి ఆల్రెడీ రెండు పెళ్లిళ్లు అయిపోయాయి. నరేష్‌కి మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్న వీరిద్దరూ కలిసి మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం, అదీ లేట్ వయసులో అనుకోవడం చాలామందిని నూరేళ్లు పెట్టేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో పవిత్ర గురించి ఇంకొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

పవిత్ర కర్ణాటక రాష్ట్రానికి చెందినది. ఈమెకు చిన్నతనం నుంచే నటనంటే ఇష్టం. ఎందుకంటే తన తండ్రి మైసూర్ లోకేష్ సినిమాలో నటించేవాడు. అతన్ని షూటింగ్స్ లో దగ్గర నుంచి చూసి ఈమె కూడా నటి కావాలని అనుకునేది. కానీ ఈమె మెయిన్ గోల్ ఐఏఎస్. కానీ సినిమాలపై మక్కువతో ఆ లక్ష్యాన్ని వదులుకొని ఇటువైపు అడుగులు వేసింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను తానే చూసుకోవాల్సి వచ్చింది. ఆమె డబ్బుల కోసం సినిమాల్లో చిన్న వేషాలు చేయడం మొదలుపెట్టింది.

అలా మెల్లిగా కన్నడలో హీరోయిన్ ఛాన్సులు అందుకోవడం ప్రారంభించింది. ఇప్పటివరకు తనకి ఐఏఎస్ అవ్వాలని ఉండేది. ఖాళీ సమయంలో ప్రిపేర్ కూడా అయ్యేది. కానీ హీరోయిన్ ఛాన్సులు రావడంతో ఆమె తన ఐఏఎస్ లక్ష్యాన్ని పక్కన పెట్టేసింది. కొన్ని రోజుల తర్వాత పవిత్ర హైట్, పర్సనాలిటీకి హీరోయిన్ క్యారెక్టర్‌కి సూట్ అవ్వదని దర్శకులు ఆమెకు అవకాశాలను ఇవ్వడం తగ్గించేశారు. దాంతో చేసేది లేక ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది.