“జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమాకు చిరు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన కెరియర్ లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. మరి ముఖ్యంగా ఆయన కెరియర్ కు మైలు రాయిగా మిగిలిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి.. వాటిలో ప్రధానంగా ‘ఖైదీ’ సినిమా చిరంజీవి కి మాస్ అభిమానులో సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత నుంచి చిరంజీవి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Jagadeka Veerudu Athiloka Sundari: ఆ సినిమా కోసం చిరంజీవి, శ్రీదేవి  పారితోషికం ఎంత తీసుకున్నారో తెలుసా?

ఆ సినిమా తర్వాత నుంచి చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదుగుతూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన కెరియర్ లో మరో అద్భుతమైన సినిమా “జగదేకవీరుడు అతిలోకసుందరి”. ఈ సినిమాను దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తెరకెక్కించగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవికి జంటగా అతిలోక సుందరి శ్రీదేవి నటించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత అశ్వినీ దత్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

జగదేకవీరుడు అతిలోకసుందరి: నాని చెప్పిన తొలి కథ

ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ జంటగా అలరించిన చిరంజీవి- శ్రీదేవిల రెమ్యూనరేషన్ ఎంతో సీక్రెట్ గా చెప్పారు. ఈ సినిమా ద్వారా తనకు ఎంత లాభం వచ్చిందో కూడా ఆయన వెల్లడించారు.
‘ఈ సినిమాకు చిరంజీవి ఆ రోజుల్లోనే దాదాపు రూ. 35 లక్షల రూపాయల పారితోషికం ఇచ్చినట్లు అశ్విని దత్ చెప్పాడు’. ‘ఆ రోజుల్లో హీరోలతో సమానంగా సూప‌ర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న శ్రీదేవి కూడా రూ.25 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు’. ‘ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ పోను నిర్మాతగా తనకు వచ్చిన లాభం రూ.35లక్షలు అని ఆయన వెల్లడించారు’.

జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ చేయాలనేది నా కోరిక.. అశ్వినీ దత్  కామెంట్స్ వైరల్? | Telugu Rajyam

అయితే ఈ మొత్తం ఇప్పుడు చిన్నమొత్తం కానీ.. ఆ సమయంలో కొన్ని కోట్ల విలువైనది. ఎందుకంటే అప్పట్లో రూ.18 లక్షలు సినిమాకు మిగిలితే సూపర్ హిట్ కింద లెక్క. అప్పుడు బాల్కనీ టికెట్ రేట్ రూ.6 రూపాయలని అశ్వినీదత్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఈ లెక్కన డబుల్ ఆదాయం వచ్చిన ఈ సినిమా బంపర్ బ్లాక్ బస్టర్ కింద లెక్కేయ్యాలి. ఇప్పటితో పోలిస్తే వందల కోట్లపైనే లాభం వచ్చినట్టు..ఆ సమయంలో ఈ సినిమా ఏకంగా రూ.7 కోట్ల షేర్ వసూలు చేసిందట.. తన దగ్గరున్న మొత్తం డబ్బు పెట్టి తీసిన ఈ సినిమా తనను నిలబెట్టిందని అశ్వినీదత్ చెప్పుకొచ్చాడు