మెగా ఇంట క్రిస్మస్ వేడుక‌లు షురూ.. అదిరిపోయే పిక్ పంచుకున్న ఉపాస‌న‌!

మెగా ఫ్యామిలీలో క్రిస్మ‌స్ వేడుక‌లు షురూ అయ్యాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలు ఏవైనా ఉంటే మెగా కజిన్స్ అందరూ ఒకే చోట చేరిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెగా ఇంట `సీక్రెట్ శాంటా` ఈవెంట్ ని నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొని సంద‌డి చేశారు. `సీక్రెట్ శాంటా` అంటే ఒకరికి ఒకరు సీక్రెట్ గిఫ్ట్స్ ఇచ్చుపుచ్చుకోవడం. అయితే నిన్న మెగా కజిన్స్ అందరూ ఇందులో పాల్గొని కానుకలను ఎక్స్ ఛేంజ్ చేసుకున్నారు.

తాజాగా మెగా కోడ‌లు ఉపాస‌న్ `సీక్రెట్ శాంటా` ఈవెంట్ లో అంద‌రి క‌లిసి దిగిన ఓ అదిరిపోయే పిక్ ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. మెగా వార‌సులంద‌రూ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించ‌డంతో అభిమానులకు క‌న్నుల పండుగా మారింది. ప్ర‌స్తుతం ఉపాస‌న షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కాగా, ఉపాస‌న త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లైన ప‌దేళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ కాబోతున్నాడు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు.

https://twitter.com/upasanakonidela/status/1605397020482899968?s=20&t=YGb0zrkFtlXz0d6K3ibFOQ