25 ఏళ్ల తర్వాత చిరు- బాలయ్య సేమ్ సెంటిమెంట్ రిపీట్‌…!

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో టాలీవుడ్ లో సినిమాల హడావిడి మొదలైంది. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఇద్దరి హీరోల సంక్రాంతి వార్‌ అంటే అభిమానులలో అంతా ఇంతా క్రేజ్ ఉండదు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకసారి చిరంజీవి విజయం సాధిస్తే మరోసారి బాలకృష్ణ విజయం సాధించారు.

Exactly one month.. still promotions with songs

వీరిద్దరూ 2017లో తమ సినిమాలతో సంక్రాంతి బరిలో పోటీ పడగా మళ్లీ ఆరు సంవత్సరాలు తర్వాత వచ్చే సంక్రాంతికి ఇద్దరు హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. చిరంజీవి బాబి దర్శకత్వంలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీర సింహారెడ్డి. ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

బాలకృష్ణ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాగా.. జనవరి 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో థియేటర్‌లో సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి విడుదలవుతున్న టీజర్,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Megastar Chiranjeevi blocks date for Waltair Veerayya, to release on 13  January

1996 లో ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో పోటీకి దిగగా ఆ సంవత్సరం ఈ ఇద్దరి హీరోలు విజయం సాధించారు. ఆ రెండు సినిమాలు అన్నయ్య సెంటిమెంట్ తో వచ్చాయి. చిరంజీవి హిట్లర్ సినిమాతో చెల్లెలకు అన్నయ్య సెంటిమెంట్ సినిమాతో వచ్చి ఘన విజయం అందుకున్నాడు. బాల‌కృష్ణ కూడా అన్నదమ్ముల సెంటిమెంట్‌తో పెద్దన్నయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Balakrishna's transformation in Veera Simha Reddy to thrill | cinejosh.com

అయితే ఇప్పుడు రాబోయే ఈ ఇద్దరి హీరోల సంక్రాంతి సినిమాల్లో కూడా అన్నయ్య సెంటిమెంట్ చుట్టూ సినిమాల స్టోరీ ఉండడంతో మళ్లీ పాతిక సంవత్సరాలు తర్వాత ఈ ఇద్దరి హీరోలు పోటీ పడబోతున్నారు అంటూ వారి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఇద్దరి హీరోలు విజయం సాధిస్తారని చిరు- బాలయ్య అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి 1996 సెంటిమెంట్ 2023వ‌ సంక్రాంతికి రిపీట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.