ఆన్ స్టాపబుల్ 2లో ప్రభాస్ Vs పవర్ స్టార్ యుద్ధం…!

నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం వ్యాఖ్యాతగా చేస్తున్న షో అన్ స్టాపబుల్… తన కెరియర్‌లో తొలిసారిగా హోస్ట్ గా చేసిన షో కూడా ఇదే. సినీ సెలబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో మొదటి సీజన్ ఎవరు ఊహించని సక్సెస్ అయ్యింది. ఆ సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జరిగే రెండో సీజన్ కూడా మొదటి సీజన్ ను మించి అదరగొడుతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్‌లో.. సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులతో కూడా బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు.

అయితే ఇప్పుడు ఈ షో కి ఇద్దరు స్టార్ హీరోలు రాబోతున్నారు. ఆ హీరోల ఎపిసోడ్ లో ఏ ఎపిసోడ్ ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటుందో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ముందుగా న్యూ ఇయర్ కనుకగా ప్రభాస్ ఎపిసోడ్ ఆహలో స్ట్రీమింగ్ కాబోతుంది. దినికి సంబంధించిన ప్రోమోస్ ఒక్కోటి బయటకు రాగా వాటికి భారీ రెస్పాన్స్ కూడా వస్తుంది.

After Prabhas, Pawan Kalyan Could be the Next Guest in Aha's Unstoppable  With NBK S2 - Pricebaba.com Daily

బాలయ్య- ప్రభాస్ మధ్య సంభాషణలు చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా మారింది. ఆ ఎపిసోడ్‌లో ప్రభాస్ తో పాటు మరో హీరో గోపీచంద్ కూడా సందడి చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. మొదటి ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30 న ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తరవాత రెండో ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక ఈ ఎపిసోడ్ తర్వాత బాలయ్య షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు.

మొన్నే షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ కూడా సంక్రాంతి కానుకగా ఆహాలో విడుదల చేయనున్నారు. న్యూ ఇయర్ కి ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ రెండు ఎపిసోడ్స్ లో ఏ ఎపిసోడ్ ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటుంది.. ఏది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందో అని చర్చ మొదలైంది. చూడాలి మరి ఈ రెండు ఎపిసోడ్‌లో ఏది పై చెయ్యి సాధిస్తుందో.