హా హా హా..వన్స్ మోర్.. నయన్ అభిమానులకి బిగ్ గుడ్ న్యూస్..ఇక పండగే పండగ..!

ఇది నిజంగా నయనతార అభిమానులకి వెరీ వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . నయనతార చాలా కాలం తర్వాత మళ్లీ తన ఫేవరెట్ హీరోతో జతకట్ట బోతుందట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే ఓ క్రేజీయస్ట్ హీరోయిన్ గా ఉంది. ఎటువంటి సినిమాలను చూస్ చేసుకుంటుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే జనాలను బాగా ఆకట్టుకుంటాయి .

ఆ విషయం కూడా మనకు బాగా తెలుసు . పెళ్లి తర్వాత కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది నయనతార . తాజాగా నయనతార డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను ఓకే చేసింది . ఈ మూవీలో మమ్ముట్టి నటిస్తున్నాడు . నయన్ మమ్ముట్టి కాంబోలో..” తస్కరా వీర అనే మూవీ వచ్చింది. ఆ తర్వాత ‘రప్పకల్’ చేశారు. ఆ తర్వాత చేసిన ‘భాస్కర్ ది రాస్కెల్’, ‘పుతియానియమం’ సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా రాబోతుందని అంటూ ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో నయనతార ఫ్యాన్స్ ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు నయనతార మమ్ముట్టి పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ఈ కాంబో కాని సెట్ అయితే నయనతార ఖాతాలో మరో క్రేజీ హిట్ కన్ఫామ్ అంటున్నారు అభిమానులు. మొత్తానికి నయన్ టైం బాగా గుడ్ గా మారిపోయింది..చూద్దాం ఇంకెన్ని మంచి మంచి ఆఫర్స్ అందుకుంటుందో..?