వేసవిలోను తరచూ జలుబు చేస్తుందా.. కారణాలు ఇవే..?!

ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. బానుడి ప్రతాపం అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. పెరుగుతున్నా ఎండల వల్ల డిహైడ్రేషన్, వడదెబ్బ లాంటి సమస్యలు వ‌స్తాయ‌న్న సంగ‌తి చాలామందికి తెలుసు. అయితే వేసవిలో వేడిమితో జలుబు కూడా వస్తుంది. వానకాలం, శీతాకాలం జలుబు కామ‌న్‌. కానీ వేసవిలో జలుబు రావడం వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా వాతావరణంలో మార్పులు, విపరీతమైన వేడి కారణంగానూ కొంతమందికి ఎండాకాలంలో జలుబు చేస్తూ ఉంటుంది.

అయితే మారుతున్న కాలానికి అనుకూలంగా సూక్ష్మజీవులు కూడా తమ స్వభావాన్ని మార్చుకుంటాయి. దీంతో వేసవిలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తున్నాయి. జలుబు, దగ్గుకు ప్రధాన కారణం ఎలర్జీ, వైరస్.. ఇన్ఫెక్షన్ అన్ని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో బలమైన వేడి గాలులు వేస్తుండడం.. పుప్పుడి ధూళి లాంటి అలర్జీ కారకాలు. శరీరంలోకి చేరి జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు ఉన్నాయట. వేసవి దెబ్బకి చాలామంది ఎయిర్ కండిషనర్ గదుల్లోనే సమయం గడుపుతూ ఉంటారు. ఇలా చేస్తే శరీరంలో డ్రైనెస్‌ పెరిగి ముక్కు, చెవి మరియు నోరు పొడిబారడంతో పాటు.. జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఎంటర్ అవుతాయి.

అలా అందరూ ఒకే ఏసీ గదిలో ఉంటే ఒక్కరికి జలుబు వచ్చిన మిగతా వారికి అది వ్యాపిస్తుంది. కనుక ముందు వేసవిలో జలుబుతో ఇబ్బంది పడేవారు.. గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆవిరి పట్టడం, విటమిన్ సి, కే పుష్కలంగా ఉండే ఆహారాలను , కూరగాయలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తరచు చేతులను కడుక్కోవడం, పరిశరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో క్రిములు నుంచి ఆరోగ్యాని రక్షించుకోవచ్చు. కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు సుదీర్ఘ నిద్ర వల్ల జలుబు సమస్య నుంచి త్వరగా కోలుకోవచ్చు.