మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ అంటేనే బిజీబిజీ షెడ్యూల్ . ఈరోజు ఇండియాలో ఉంటే రేపటి రోజు వేరే కంట్రీలో ఉండాలి ..అలాంటి పరిస్థితులు ఎంతోమంది స్టార్ హీరోస్ ఫేస్ చేశారు . అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. రాను రాను మరో మహేష్ బాబు లా తయారైపోతున్నాడు అంటూ నాటి నాటిగా కామెంట్స్ పెడుతున్నారు . ఇంతకీ తారక్ అంత నాటి పని ఏం చేశాడు అని అనుకుంటున్నారా ..? అయితే ఇది చదవండి మీకే అర్థమవుతుంది…!
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ దేవర సినిమాను అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. కాగా వార్ 2 సెట్స్ పై ఉండగానే సినిమా షూట్స్ కి బ్రేక్ వేసి మరి ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి చెక్కేశాడు .
తాజాగా ఎయిర్పోర్ట్లో తారక్ కనిపించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి . అయితే తారక్ ఎక్కడికి వెళ్ళాడు అన్నది మాత్రం క్లారిటీ లేదు . పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాడు అంటూ ప్రచారం జరుగుతుంది . సాధారణంగా మహేష్ బాబు మాత్రమే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ఇప్పుడు ఆ లిస్టులోకి తారక్ కూడా జాయిన్ అయిపోయాడు అంటూ సరదాగా ఆటపట్టిస్తున్నారు అభిమానులు..!!