కన్న కొడుకు అఖిల్ పై పీకల్లోతూ కోపంగా ఉన్న అమల..అంత గబ్బు పని ఏం చేశాడంటే..?

అక్కినేని అఖిల్ పై అక్కినేని అమలా కోపంగా ఉందా ..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అటువంటి ఓ చెరగనీ స్థానాన్ని అందుకున్నాడు నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు నాగార్జున. ఇప్పుడు ఆ బాధ్యతలు నాగచైతన్య – అఖిల్ పైపడ్డాయి.

కాగా అక్కినేని అఖిల్ హీరోగా సెటిల్ అయితే చూడాలి అన్నది నాగార్జున-అమల చిరకాల కోరిక . ఆయన దురదృష్టమో లేక టైం బ్యాడ్ అనేది తెలియదు కానీ.. ఆయన చూస్ చేసుకున్న ప్రతి సినిమా కూడా ప్లాప్ అవుతుంది. ఎలా అంటే దారిన పోయే దరిద్రాన్ని నెత్తినెక్కించుకున్నట్లు . ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ దక్కలేదు ..అంటే కారణం ఆయన చూస్ చేసుకున్న కాన్సెప్ట్లే.. అయితే తన సొంత కాలపై తానే నిలబడాలి అని నాన్న చెప్పిన కాన్సెప్ట్ ..నాన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉపయోగించుకోకుండా అఖిల్ సొంత నిర్ణయాలు చూస్ చేసుకుంటున్నారట.

రీసెంట్గా అక్కినేని నాగార్జున ఒక బడా డైరెక్టర్ తో అఖిల్ మూవీ ని ఫిక్స్ చేశారట . కానీ అఖిల్ మాత్రం ససేమిరా అలా చేయను.. నా కాళ్లపై నేను నిలబడతాను అంటూ తెగేసి చెప్పేసాడట. అఖిల్ వయసు కూడా ఎక్కువగా అయిపోతుంది. రానున్న రోజుల్లో ఫ్లాప్స్ పడితే హీరోగా సెటిల్ అవ్వడం కష్టమే .. ఈ విషయంలో అమల ఇన్వాల్వ్ అయిన కూడా తల్లి మాట కూడా వినలేదట. దీంతో అఖిల్ పై అమల గుర్రుగా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!