అప్పుడు పద్ధతిగా పంజాబీలో.. ఇప్పుడు హాట్ నెస్ బ్రాండ్ అంబాసిడర్.. ఈమె ఎవరో గుర్తుపట్టారా..?!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి హీరోయిన్ల వరకు హాట్ అండ్ గ్లామర్ ఫోటోలతో తమ ఫాలోవర్స్ ను హీటెక్కిస్తున్నారు. జిమ్ వర్కౌట్, వెకేషన్ పిక్స్ ఇలా హాటెస్ట్ పిక్స్ ను తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఫేమస్ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనం చూడబోయే ఈ బ్యూటీ కూడా ఆ కొవ్వకే చెందుతుంది. ఒకప్పుడు పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హాట్ నెస్ కి పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయింది. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ కుట్టి.. తమిళనాడు మాత్రమే కాదు తెలుగులోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Bachelor (2021)

ఎప్పటికప్పుడు లేటెస్ట్ గ్లామర్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ఈ బ్యూటీ.. తమిళ స్టార్ బ్యూటిగా క్రేజ్‌ సంపాదించింది. తెలుగులో కూడా భారీ పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. ఈ చిన్నది మరెవరో కాదు దివ్యభారతి. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దివ్యభారతి.. తమిళనాడు, కోయంబత్తూర్ లో జన్మించింది. మొదటి సినిమా బ్యాచిలర్ తోనే హద్దులు చెరిపేసి.. గ్లామర్ షో, ముద్దులు, హగ్గ్‌లు, ఇంటిమేట్ సీన్స్ తో రెచ్చిపోయింది ఈ అమ్మడు.

Poised Poses Of Divya Bharathi

తెలుగులోను ఈ సినిమా డబ్ కావడంతో ఇక్కడ కూడా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. మజిల్ మెల్ కాదల్, కింగ్ స్ట‌న్‌, మహారాజా లాంటి సినిమాలతో పాటు జర్నీ వెబ్ సిరీస్ లోను నటించింది. ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుదీర్ స‌ర‌సన గోట్ ( గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ) అనే సినిమాలో నటించింది. నరేష్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ తాజాగా రిలీజై ఫాన్స్ ను ఆకట్టుకుంది. దీంతోపాటు లింగం అనే మరో వెబ్ సిరీస్ లో కూడా కనిపించనుంది. కాగా ఈ వయ్యారి లేటెస్ట్ గా శ్రీలంక టూర్ లో దిగిన ఫొటోస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారాయి.