ఆ హీరోయిన్ ని ఒంటరు చేసిన టాలీవుడ్ హీరోలు .. కత్తిలాంటి ఫిగర్ ని నిండా ముంచేసారుగా..!

ఎస్ ప్రజెంట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని వాడుకొని వదిలేయడం సర్వసాధారణమే.. అయితే ఇక్కడ వాడుకొని వదిలేయడం అంటే ఏదో వాడుకొని వదిలేయడం కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతవరకు ఆ హీరోయిన్ ని ఓ రేంజ్ లో పొగుడుతూ కత్తి – తోపు- తురుము అంటూ ఆ హీరోయిన్ కి డప్పుకొడుతూ భజన చేస్తూ వన్స్ ఆ హీరోయిన్ అవకాశాలు తగ్గిన తర్వాత ఆమె ఉందా ..? పోయిందా..? అనే విషయం కూడా పట్టించుకోకుండా ఉంటారు కొందరు హీరోలు .

తాజాగా అలాగే చేశారు మన టాలీవుడ్ హీరోలు అంటూ ఓ హీరోయిన్ మండిపడుతుంది . తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్ చేసింది. బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది . తనదైన స్టైల్ లో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసింది. అయితే తన బిజినెస్ ప్రమోషన్స్ కోసం చాలామంది స్టార్స్ ని అప్రోచ్ అయిందట కానీ ఎవ్వరు కూడా ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దారుణాతి దారుణంగా అవమానించారట.

ఒకప్పుడు ఆ హీరోయిన్ కాల్ చేస్తే గంటలు గంటలు మాట్లాడే హీరోలు కూడా ఆ హీరోయిన్ పర్సనల్గా వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదట. షూటింగ్స్ లో బిజీగా ఉన్నామంటూ మేనేజర్స్ దగ్గర చెప్పించి ఆమెను పంపించేసారట. దీంతో ఆ హీరోయిన్ పరువు పోయినట్లయింది. ఈ విషయం పట్ల తెలుగు హీరోలపై ఆ హీరోయిన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!