ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టుకోను.. కారణం ఇదే.. స్నేహ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ స్నేహకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ రోల్స్‌లో మెప్పిస్తున్న‌ సంగతి తెలిసిందే. 2009లో అచ్చముండు అచ్చముండు సినిమాతో హీరో ప్రస‌న్న‌ కుమార్‌తో కలిసి నటించి మెప్పించింది. ఈ సినిమా షూట్ టైంలో ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడి 2012లో కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సమక్షంలోనే వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది స్నేహ.

Sneha In Pythani Silk Saree Saree Blouse Patterns, 47% OFF

ఈమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు విగాన్, కూతురు అధ్యంతతో మొన్నటి వరకు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసిన స్నేహ.. ఇటీవల సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి ప‌లు సినిమాల‌లో కీలకపాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది. స్టార్ హీరోల సినిమాలలో అక్కగా, వదినగా మంచి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్న ఈ అమ్మడు.. మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ క్రమంలో స్నేహ గతంలో తన డ్రెస్సింగ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ తన దుస్తుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో ప్రముఖ మ్యాగజైన్ స్నేహ తరుచుగా ఒకే దుస్తులు వేసుకుంటుంది.. ఆమె ధరించడానికి కూడా వేరే బట్టలు లేవు అంటూ రాసిందని.. ఆ తర్వాత దాని గురించి ఆమె దుస్తులపై ఎన్నో విమర్శలు ఎదురయ్యాయని.. అందుకే ఒకసారి వేసుకున్న బట్టలు, చీరలు మళ్లీ వేసుకోనని ఆమె వివరించింది. ఒకసారి వేసిన తరువాత తెలిసిన వారికి.. లేదా తన స్నేహితులకు ఇచ్చేస్తానంటూ.. చెప్పిన స్నేహ.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను అంటూ వివరించింది. కాగా ఇప్పుడు మరోసారి స్నేహ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.