ఓరి దేవుడోయ్..రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు అన్ని కేజీల బరువు తగ్గాడా ..? రియల్లీ గ్రేట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పోపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎలాంటి సినిమాలు కోసమైనా సరే తనదైన స్టైల్ లో కష్టపడుతూ 100% న్యాయం ఇవ్వడానికి చూస్తాడు . ఇక అలాంటిది టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే మ్యాటర్ ఏ రేంజ్ లో ముందుకు వెళ్తుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు . రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాకి కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నాయి. సినిమాని కూడా త్వరగానే సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ . ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయిపోయాయి ..హీరోయిన్స్ విషయంలో కూడా ఫైనల్ డెసిషన్ కి వచ్చేసాడు రాజమౌళి అంటూ న్యూస్ వైరల్ గా మారింది. కాగా రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో మహేష్ బాబు ఓటు వేయడానికి బయటకు వచ్చాడు . అప్పుడు ఆయన క్రేజీ లుక్ అద్దిరిపోయింది .

హక్కా స్టైల్ లో అదిరిపోయే రేంజ్ లో కనిపించాడు ..చాలా యంగ్ గా మారిపోయాడు జుట్టు పెంచేసి కుర్రాడిలా తయారైపోయాడు . అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళితో తెరకెక్కే సినిమా కోసం దాదాపు 12 కేజీల పైనే బరువు తగ్గాడట .. ఇంకా కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారట .. టోటల్ సరికొత్త లుక్ లో మనం మహేష్ బాబుని చూడబోతున్నామంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో మహేష్ బాబు అభిమానులు సైతం ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు..!!