ఇటీవల కాలంలో భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు వచ్చిన మరుక్షణం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఈ విషయం సెలబ్రిటీల నుండి సాధారణ జనం వరకు కామన్ అయిపోయింది. అలా సెలబ్రిటీలలో పెళ్లయిన 6 నెలలకే విడాకులు తీసుకుని విడిపోయిన జంటలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తేర్ జంట కూడా ఒకటి.
వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అంతా బాగుంది అనే లోపే వారిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడిపోవడానికి కారణాలు చెప్పారు కానీ.. విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు నిందలు వేయడానికి రెడీ అవుతుంటారు. ఇటీవల కాలంలో ఎస్తేర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా వారి వివాహ బంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
అయితే ఆమెపై నోయల్ నిందలు వేసి నెగిటివ్ ప్రచారం చేశాడంటూ ఆమె ఆరోపించింది. అంతేకాకుండా నోయల్ తనని అన్ని రకాలుగా వాడుకున్నాడంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలా వారిద్దరూ విడిపోయిన తర్వాత బిగ్ బాస్ కి వెళ్లిన నోయల్ విడాకుల విషయాన్ని సానుభూతి కోసం వాడుకున్నాడు అని చెప్పింది. అది చూశాక ఎస్తేరుకు ఇలా ఎవరైనా చేస్తారా? ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించిందట.
అయితే ఎస్తేర్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదని అనుకుందట.. కానీ తనని నోయల్ బ్యాడ్ చేస్తున్నాడంటూ ఆమె పేర్కొంది. దీంతో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ అలాగే ట్రోల్స్, మెసేజ్లు ఎక్కువ కావడంతో మీడియాకు తాను సమాధానం చెప్పాలని ఇప్పుడు బయటపడినట్టు చెప్పింది. అయితే ఎస్టర్ నోయల్ పెళ్లయిన 6 నెలల తర్వాత విడాకులు తీసుకున్న.. కలిసి ఉన్నది మాత్రం కేవలం 16 రోజులు మాత్రమే అంటూ.. కానీ ఈ విషయం చెప్తే ఎవరూ నమ్మరు. తప్పులనేవి ఇద్దరు సైడు ఉంటాయి కానీ ఒకరిని నిందించడం తప్పు అంటూ ఆమె ఆరోపించింది. ఇక ప్రస్తుతం ఎస్తేరు చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.