కాలు విరగ్గొట్టుకున్న త్రిష.. ఆందోళనలో అభిమానులు!

త్రిష.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. నాలుగుపదుల వయసులో కూడా ఎక్కడా తగ్గని అందంతో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా నటిస్తూ త‌న సత్తా చాటుతుంది.

తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పోనియన్ సెల్వన్` సినిమాలో కుందవై పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో త్రిష కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా విదేశాలకు వెళ్లిన త్రిష కాలికి గాయంతో తిరిగి వచ్చింది. అయితే విదేశీ టూర్ లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె కాలు విరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాలికి పట్టివేసి ఉన్న ఫోటోని త్రిష తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి దాని కింద ప్రమాదం కారణంగా వెకేషన్ మధ్యలోనే రావాల్సి వచ్చిందంటూ రాసుకొచ్చింది. ఇక త్రిష షేర్ చేసిన ఫోటోని చూసిన ఆమె అభిమానులు ఆందోళన చెందుతూ.. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.