నగరి పోరు: రోజాకు రిస్క్ ఎక్కువేనా?  

రాజకీయాల్లో విజయాలు ఈజీగా రావు..రాజకీయంగా ఎంతో కష్టపడి..ప్రజల మద్ధతు పెంచుకుంటూనే విజయాలు దక్కుతాయి. అయితే మొదట ఎమ్మెల్యేగా పరాజయం పాలైన రోజా..ఇప్పుడు మంత్రిగా ఎదిగే వరకు కష్టపడ్డారు. టీడీపీలో ఉండగా వరుసగా రెండు సార్లు ఓడిపోయారు..2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ తర్వాత వైసీపీలోకి వచ్చాక ఆమెకు అన్నీ కలిసొచ్చాయి..అలాగే వరుసగా ఓడిపోతున్న సానుభూతికి ఆమెకు ప్లస్ అయింది…అందుకే 2014లో తొలిసారి నగరి బరిలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక అదే ఊపుతో 2019 ఎన్నికల్లో కూడా గెలిచేశారు….అలాగే రోజాకు మంత్రిగా పదవి కూడా దక్కింది. మంత్రిగా ఆమె దూసుకెళుతున్నారు. అయితే మంత్రి అయిపోయారు కదా…ఆమెకు రాజకీయంగా అంతా బాగానే ఉంది అనుకుంటే పొరపాటే..ఇప్పుడే ఆమెకు కష్టాలు ఎక్కువయ్యాయి. ఓ వైపు నగరిలో టీడీపీ బలపడుతుంది…గత రెండు ఎన్నికల్లో టీడీపీ కేవలం స్వల్ప మెజారిటీల తేడాతోనే ఓడిపోయింది…కానీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి.

అలాగే వరుసగా ఓడిపోతున్న సానుభూతి టీడీపీపై ఉంది. ఇలా టీడీపీకి ప్లస్ పెరుగుతుందని చెప్పొచ్చు..అదే సమయంలో రోజాకు టీడీపీ కంటే సొంత పార్టీతో తలనొప్పి ఎక్కువైంది..మొదట నుంచి ఇక్కడ రోజాకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ నేతలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కేజే శాంతి లాంటి లీడర్లు..రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో ఆమెకు గాని సీటు ఇస్తే సహకరించమని ముందే చెప్పేస్తున్నారు. అయితే వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టాలని రోజా గట్టిగానే ట్రై చేస్తున్నారు.

కానీ ఆ వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఉందని ప్రచారం జరుగుతుంది..ఈ నేపథ్యంలో రోజా వ్యతిరేక వర్గంపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది. మొత్తానికైతే నగరిలో రోజాకు రాజకీయం అనుకూలంగా లేదు…ఎన్నికల నాటికి ఈ రచ్చ ఇంకా ముదిరితే రోజాకు ఎన్నికల్లో రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఆమెకు గెలుపు అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది.