వెండితెరపై మెరిసిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి..!!

ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయాల్లోకి వెళ్తుంటే.. రాజకీయాలలో చక్రం తిప్పిన వారు సినిమాలలోకి అడుగుపెడుతూ నటనపై తమకున్న ఇష్టాన్ని చూపించుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎంతోమంది వెండితెరపై మంచి స్టార్లుగా కొనసాగిన వారు కూడా రాజకీయాలలో మరింత గుర్తింపును సొంతం చేసుకుని.. మళ్లీ సినిమాల లోకి ఎంట్రీ ఇస్తున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి కొంతమంది ఏమో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకొని.. రాజకీయాలలో ఉన్నత పదవులు చేపట్టి .. చివరికి అక్కడ పదవులు లేక ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కూడా ఒకరు.AP Deputy CM Pushpa Srivani Tests Covid 19 Positive

పాముల పుష్ప శ్రీవాణి 8 జూన్ 2019 నుండి 7 ఏప్రిల్ 2022 వరకు ఆంధ్రప్రదేశ్ 11వ ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఈమె కురుపాం నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలుఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలు. ఇక ప్రస్తుతం ఈమెకు ఉపముఖ్యమంత్రి పదవిపోవడంతో వెండితెరపై నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె నటించిన సినిమా జులై 22వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోనే పలు థియేటర్లలో విడుదల కావడం జరిగింది. ఇకపోతే మంత్రిమండలి పునః వ్యవస్థీకరణలో భాగంగా పదవిని కోల్పోయిన ఈమె పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు. ఇక ఇప్పుడు అమృత భూమి అనే సినిమాలో కీలకపాత్రలో పుష్పశ్రీవాణిని చూసి అందరూ షాక్ అయ్యారు.pamula pushpa srivani, Amrutha Bhoomi: సిల్వర్ స్క్రీన్‌పై ఏపీ మాజీ  డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. మూవీ వచ్చేసింది - ap ex deputy cm pamula pushpa  srivani acted in amrutha bhoomi - Samayam ...

మొదటినుంచి నటనపై ఆసక్తి ఉన్న ఈమె ఎక్కువగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేవారు. ఇక ఇప్పుడు నేరుగా వెండితెరపై చూడగానే అభిమానులు అందరూ సంబరపడిపోతున్నారు. ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ పార్వతీపురానికి చెందిన జట్టు , ఆశ్రమం, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బ్రహ్మానందం కోరుకొండ దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమాలో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేసే ఉపాధ్యాయురాలి పాత్రలో ఈమె నటించారు.