పీకేను పిండేయబోతున్న జగన్ ..ఎలాగంటారా ఇలా ?

ఔను! ఇప్పుడు ఈ సందేహాలు కూడా వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో ఇది అర్హ‌మైన‌ది.. ఇది కాదు.. అని చెప్ప డానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. నాయ‌కులు ఆయా అవ‌స‌రాల‌ను త‌మ కు అనుకూలంగా మార్చుకునేందుకు ఖ‌చ్చితంగా ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇప్పుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్ కూ డా భ‌విష్య‌త్తులో ఇలాంటి వ్యూహ‌మే వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పోటీ తీవ్ర‌త పెరి గి.. త‌ను గెల‌వడం క‌ష్ట‌మ‌ని అనుకున్న‌ప్పుడు.. సెంటిమెంటును సైతం ఆయ‌న ప్లే చేసే అవ‌కాశం ఉంద ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

“రాజకీయాల్లో పొత్తులు అంద‌రూ పెట్టుకుంటున్నారు. కానీ, వైసీపీ మాత్రం ఒంట‌రిగానే పోటీకి దిగింది. మాకు కూడా ఆఫ‌ర్ వ‌చ్చింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే.. కేంద్రంలో అది ఇస్తాం.. ఇది ఇస్తాం. అని మాకు కూడా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ, మేం మాత్రం పొత్తులకు సిద్ధం కాలేదు. మాకు పొత్తుల‌తో ప‌నిలేదు. కేవ‌లం.. ప్ర‌జ‌ల‌తోనే ప‌ని. మ‌మ్మ‌ల్ని ఏపీకి అన్యాయం చేసిన ఒక‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌ని.. సూచించి న ప్రశాంత్ కిషోర్‌ను సై తం.. మేం ప‌క్కన పెట్టాం. ఇది మా నిబ‌ద్ధ‌త‌“ అని జ‌గ‌న్ ప్రచారం చేసుకునే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు.

రాజ‌కీయాల్లో ఏ విష‌యాన్న‌యినా.. నాయ‌కులు త‌మ‌కు అవ‌కాశంగా మార్చుకుంటారు. దీనిలో ఎవ‌రూ ఎవ‌రికీ అతీతులు కారు. రేపు కాంగ్రెస్‌తో జ‌గ‌న్ పొత్తు పెట్టుకుంటే.. ప్ర‌తిప‌క్షాలుసైతం.. రాష్ట్రాన్ని విభ‌జిం చిన పార్టీతో పొత్తు పెట్టుకున్నార‌నే ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. ఇక‌, ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కులు.. సైతం.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుందో లేదో తెలియ‌ని పరిస్థితిలో ఉన్న టీడీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం లేదా? అందుకే.. ఇప్పుడు.. పీకేను వ్య‌క్తిగ‌త ఆలోచ‌న‌ల నిమిత్తం.. ఎవ‌రో ఏదో చేసిన ఒత్తిడి మేర‌కు ప‌క్క‌న పెట్టారు.

అయితే. దీనిని కూడా త‌న‌కు అన‌కూలంగా మార్చుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో విష‌మ ప‌రిస్థితి ఎదురైతే.. ఖ‌చ్చితంగా ఈ అంశాన్ని కూడా తెర‌మీదికి తెచ్చి.. తాను.. పీకేను సైతం దూరం చేసుకున్నాన‌ని.. తెలుగు ప్ర‌జ‌ల కోసం.. రాష్ట్రం కోసం.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోమ‌న్నా.. వ‌ద్ద‌న్నాన‌ని.. ఆయ‌న సెంటిమెంటు ర‌సం పిండేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.