ప‌వ‌న్ – జ‌గ‌న్ – లోకేష్ ఎవ‌రి స‌త్తా ఎంత‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాపిక్‌! ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌, లోకేష్‌లు విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్ద‌రూ వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌తో మ‌మేకం అవుతున్నారు. కాకినాడలో స‌భ నిర్వ‌హించిన త‌ర్వాత ఆ ప్రాంతంలోని విద్యార్థుల‌తో స‌మావేశ మ‌య్యారు. ఇటీవ‌ల అనంత‌పురంలో నిర్వ‌హించిన స‌భ అనంతరం కూడా ఆయ‌న విద్యార్థుల‌తో మీటింగ్ పెట్టారు. పొలిటిక‌ల్ లీడ‌ర్స్ స‌మాజంలోని అన్ని వ‌ర్గాల వారికీ ట‌చ్‌లో ఉండ‌డం కొత్త‌కాదు. ఇక‌, ఈ ముగ్గురు నేత‌ల ఇంట‌రాక్ష‌న్ ఎలా ఉందో చూద్దాం..

ప్రస్తుతం విద్యార్థుల‌కు పాలిటిక్స్‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. ఒక్క‌మాట‌లో వాళ్ల‌లో ప్ర‌శ్నించే త‌త్వం పెరుగుతోంది. ప్ర‌స్తుత రాజ‌కీయాలు స‌హా అవినీతి వంటి అనే క విషయాల‌పై విద్యార్థులు త‌మ మ‌న‌సులో మాట‌లు బ‌య‌ట పెడుతున్నారు. అయితే, ఈ విష‌యాల్లో విద్యార్థుల ప్ర‌శ్న‌ల‌కు నేత‌లు స‌మాధానం చెప్ప‌డంలో ఒకింత ఇబ్బంది ప‌డుతున్నార‌నే చెప్పాలి. లోకేష్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న త‌ర‌చు విద్యార్థ‌లుతో ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే, విద్యార్థుల‌డిగే ప్ర‌శ్న‌ల‌కు ఆశించిన ఆన్స‌ర్ రాక‌పోగా.. ప‌బ్లిక్ ఎగ్జామ్‌లో పేప‌ర్ లీకైన‌ట్టు.. విద్యార్థులు అడిగే ప్ర‌శ్న‌లు ఈయ‌న‌కు ముందే తెలిసిపోయిన‌ట్టు స‌మాధానాలు చెబుతుంటారు. ఒక్క‌మాట‌లో చెప్పాంటే.. లోకేష్ చాలా గొప్ప సమర్థుడన్న నమ్మకం క‌ల‌గాల‌న్న‌ ప్రయత్నంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మ‌రి ఇది స‌క్సెస్ అవుతుందో? ఫెయిల్ అవుతుందో చూడాలి.

ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం త‌ప్ప మ‌రో పొలిటిక‌ల్ మైలేజీ కోసం ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నం మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌దు. బ‌హిరంగ స‌భ నిర్వ‌హించినా.. విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అయినా.. ఒక్క‌టే పంథా! అన్ని రోగాల‌కు ఒక్క‌టే మందు అన్న‌ట్టు.. బాబుపై విమ‌ర్శ‌లు సంధించ‌డమే త‌ప్ప మ‌రో మార్గం క‌నిపించ‌డంలేదు. దీంతో జ‌గ‌న్ ప్ర‌సంగాలు బోరుకొట్టిస్తున్నాయ‌నేది విద్యార్థుల్లో టాక్‌. అదేస‌మ‌యంలో విద్యార్థులు ఎంతో ఆస‌క్తిగా ప్ర‌శ్నించే అవినీతి, బ్లాక్ మ‌నీ, ఉద్యోగ క‌ల్ప‌న వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం జ‌గ‌న్ ద‌గ్గ‌ర లేద‌నే చెప్పాలి. దీంతో జ‌గ‌న్ ఇంట‌రాక్ష‌న్స్ దాదాపు ఏక‌ప‌క్షంగానే సాగుతున్నాయి. కొస‌మెరుపు ఏంటంటే.. తాను సీఎం పీఠం కోసం ఎంత ఆరాట‌ప‌డుతున్నాడ‌నే విష‌యం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతుంటుంది.

ఇక‌, ప‌వ‌న్ విష‌యానికి వ‌చ్చే స‌రికి కొంత భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్లో క్లారిటీ ఉంది. తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది ఏమిటో సూటిగా సుత్తి లేకుండా చెబుతుండ‌డం ప‌వ‌న్‌కి ప్ల‌స్‌! విద్యార్థులు కూడా ప‌వ‌న్ ప‌ట్ల ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్‌కి ఇప్ప‌టికిప్పుడు సీఎం అవుదామ‌ని, మినిస్ట‌ర్ అవుదామ‌ని, ప్ర‌భు్త్వం ఏర్పాటు చేయ‌డం అనేవి టార్గెట్ కాదు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌డంలోనూ ప‌వ‌న్ ఫాస్ట్‌గానే ఉంటున్నాడు. అవినీతి, న‌ల్ల‌ధనం వంటి వాటిపైనా ప‌వ‌న్ క్లారిటీ ఇస్తున్నారు. దీంతో లోకేష్‌, జ‌గ‌న్‌ల క‌న్నా.. ప‌వ‌న్ దూకుడుగానే ముందుకు పోతున్న‌ట్టు చెప్పాలి.