నాలుగు జిల్లాలే టీడీపీకి ప్లస్..!

ఏపీలో రాజకీయ సమీకరాణాలు మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా రాజకీయం…కొంతకాలం నుంచి కాస్త మారుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత కావొచ్చు…జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉండటం కావొచ్చు…ఇలా కొన్ని పరిణామాల వల్ల వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. కాకపోతే ఇప్పటికీ వైసీపీకి అధికారంలోకి వచ్చే బలం ఉంది…గతం కంటే కాస్త బలం తగ్గింది గాని…మరీ అధికారం కోల్పోయే బలం మాత్రం తగ్గలేదు. అటు గతంతో పోలిస్తే టీడీపీ బలం పెరిగింది గాని…అధికారంలోకి వచ్చేంత […]

ప్లాస్టిక్ పాలిటిక్స్…పవన్ కోసమేనా?

ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి చాలా హానికరం…ప్లాస్టిక్ వల్ల మనవాళికి చాలా నష్టం కూడా ఉంది…అందుకే ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందుకెళుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించింది. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్లీలను నిషేధిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ స్ఫూర్తిగా 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ రాష్ట్రంగా మార్చి చూపిస్తామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు చేసేది…దీన్ని అందరూ […]

మంత్రుల తెలివి..జగన్‌కే డేంజర్ ?

ఏపీలో మంత్రులు…తమ తమ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియడం లేదు గాని…ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి…చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేయడం మాత్రం తెలుస్తోంది. మంత్రులు అంటే ప్రతిపక్ష నాయకులని తిట్టడానికే ఉన్నారా? అనే డౌట్ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మంత్రులు టార్గెట్ కేవలం..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోకూడదనే కాన్సెప్ట్‌లోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేయడానికి బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొందరు మంత్రులు ప్రత్యేకంగా పవన్‌ని టార్గెట్ చేసి […]

మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు. అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ […]

టీడీపీ-జనసేన: ఐదు జిల్లాల్లో స్వీప్?

రాజకీయాల్లో క్లీన్ స్వీప్ విజయాలు అనేది మంచి ఊపునిస్తాయి…పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందడం అనేది గొప్ప విషయమే. అయితే అలాంటి గొప్ప విజయాలు అరుదుగానే వస్తాయి. ఇక అలాంటి విజయాలు ఏ మధ్య ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలు వైసీపీ […]

చీరాలలో కొత్త ట్విస్ట్..?

2014 ఎన్నికల నుంచి చీరాల నియోజకవర్గంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి..అసలు ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో..ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్…2014 ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. వ్యక్తిగత ఇమేజ్ తోనే ఆమంచి గెలిచారు. అప్పుడు టీడీపీ నుంచి పోతుల సునీత పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో…ఆమంచి టీడీపీలోకి వచ్చారు. దీంతో […]

రిజర్వ్ స్థానాల్లో సైకిల్ రివర్స్!

మొదట నుంచి రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి అంత కలిసిరాదనే చెప్పాలి…ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్..ఆ తర్వాత వైసీపీ హవా కొనసాగుతూ వస్తుంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 29 ఎస్సీ స్థానాలు, 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగింది. కేవలం టీడీపీ ఒకటి, జనసేన ఒక ఎస్సీ స్థానాన్ని మాత్రం గెలుచుకున్నాయి. మిగిలిన సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు నిదానంగా మారుతున్నాయి. ఇప్పుడుప్పుడే టీడీపీ పుంజుకుంటుంది. […]

కమ్మని కాపు కాస్తున్న కల్యాణ్..!

అసలు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని…పవన్ లక్ష్యం ఒక్కటే అని అది చంద్రబాబుని సీఎం చేయడమే అని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని…ఇలా చంద్రబాబు-పవన్ ఒక్కటే అని చెప్పి సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్థాయిలో వైసీపీ..పవన్ ని టార్గెట్ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటే పవన్ కల్యాణ్ కు పూర్తి బలమైతే లేదు…జనసేన పార్టీ గట్టిగా చూసుకుంటే […]

అంబటి రాంబాబుకు పవన్ చెక్?

ఏ  వర్గం నేతలు…ఆ వర్గం నేతలనే తిడతారు…ఏపీ రాజకీయాల్లో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఉదాహరణకు చంద్రబాబుని తిట్టాలంటే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ముందు ఉంటారు…అలాగే పవన్ ని తిట్టాలంటే కాపు వర్గానికి చెందిన నేతలు బయటకొస్తారు. వైసీపీలోని కాపు వర్గం నేతలు…ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి పవన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందు ఉన్నారు. అయితే అంబటి […]