గోల్డ్‌స్డోన్ కుంభ‌కోణంలో ఇద్ద‌రు మాజీ మంత్రులు..?

ఓ వైపు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ దూకుడు ముందు విప‌క్షాల‌న్ని చెల్లా చెదురైపోతున్నాయి. అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ సైతం చేతులెత్తేసింది. ఇక అధికార ప‌క్షంలో లోపాలు కాంగ్రెస్ వాళ్ల‌కు ఎలాగూ దొర‌క‌వు..కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌పై ఏదైనా నెగిటివ్ వార్త వ‌చ్చిన‌ప్పుడు కూడా దానిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేలా ఫోక‌స్ చేసే విష‌యంలో కూడా వాళ్లు ఘోర‌మైన డిజాస్ట‌ర్ షో వేస్తూ ప్లాప్ మీద ప్లాప్ పాలిటిక్స్ చేస్తున్నారు. […]

పాల్వాయి మ‌ర‌ణం వాళ్ల‌కు రిలీఫ్‌…. ఈయ‌న‌కు మైన‌స్‌

తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా త‌న‌దైన స్టైల్లో చెర‌గ‌ని ముద్ర వేస్తూ వ‌స్తోన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) శుక్రవారం కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యి అక్క‌డ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. పాల్వాయి మృతి తెలంగాణ రాజ‌కీయాల్లో కొంద‌రికి రిలీఫ్ అయితే మరికొంద‌రికి మైన‌స్‌గా మార‌బోతోంద‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ […]

వైసీపీ + కాంగ్రెస్ పొత్తు

ఈ హెడ్డింగ్ చూడ‌డానికి కాస్త విచిత్రంగానే ఉండొచ్చు. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ కాంగ్రెస్‌తోనే విబేధించి వైసీపీ పెట్టాడు..మ‌రి అలాంటి జ‌గ‌న్ అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటాడ‌న్న‌ది పెద్ద క్వ‌శ్చ‌నే. అయితే అప్పుడు జ‌గ‌న్ సీఎం పోస్టు కోస‌మో లేదా మ‌రో అవ‌స‌రం కోస‌మో కాంగ్రెస్‌తో విబేధించి వైసీపీ పెట్టి ఉండొచ్చు….అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ ప‌రిస్థితి ఏపీ వ‌ర‌కు (ఆ మాట‌కు వ‌స్తే దేశంలోను ఏమంత గొప్ప‌గా లేదు) స‌మాధికి చేరువుగా ఉంది. శ‌తాబ్దం చ‌రిత్ర […]

ఆ ఎమ్మెల్యే దంపతులు టీఆర్ఎస్ లో ఇమడలేక పోతున్నారా.!

వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ‌, ముర‌ళీ దంప‌తుల పేరు చెపితే స‌మైక్య రాష్ట్ర రాజ‌కీయాల్లోనే తెలియ‌ని వారు ఉండ‌రు. కాంగ్రెస్‌లో లేడీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి వైఎస్ హ‌యాంలో మంత్రి అయ్యారు. వైఎస్‌తో సురేఖ దంప‌తుల‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. 2008లో ఆమె వైఎస్ సూచ‌న మేర‌కు హ‌న్మ‌కొండ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. త‌ర్వాత జ‌గ‌న్ వైసీపీలో చేరిన సురేఖ త‌న మంత్రి ప‌ద‌వి వ‌దులుకుని […]

ఈసారి ప‌వ‌న్ మ‌ద్ద‌తు కాంగ్రెస్‌కేనా?!

ఏపీ కాంగ్రెస్ వేసిన ప్లాన్‌కి ప‌వ‌న్ భ‌లే స‌రెండ‌ర్ అయ్యాడే! అని ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఆదివారం గుంటూరు వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక హోదా పోరుకు తెర‌దీసింది. దీనికి ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ కూడా వ‌చ్చారు. అయితే, ఇప్ప‌టికే ఏపీలో స‌స్పెక్ట్‌లో ప‌డిపోయిన కాంగ్రెస్‌.. ఇప్పుడు త‌న ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఉద్య‌మాన్ని తెర‌మీద‌కి తెచ్చింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు.. త‌మ స‌భ‌ను […]

కాంగ్రెస్ స‌భ‌కి.. ప‌వ‌న్‌, జ‌గనా..!

గుంటూరు వేదిక‌గా ఆదివారం కాంగ్రెస్ నిర్వ‌హించ‌నున్న హోదా కోసం స‌భకు పెద్ద ఎత్తున ఇంకా చెప్పాలంటే హోదా క‌న్నా ఎక్కువ‌గానే ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా హాజ‌రవుతున్నారు. దాదాపు 2019 ఎన్నిక‌ల నాటికి హోదా ను పెద్ద సెంటిమెంట్ అంశం చేసేసి.. ఏపీ ప్ర‌జ‌ల ఓట్లు కొల్ల‌గొట్టాల‌ని కాంగ్రెస్ స్ఠానిక నేత‌లు పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. అందుకే హోదా కోసం పోరు పేరుతో అన్ని పార్టీల వారినీ ఏకం చేయాల‌ని […]

కాంగ్రెస్ సభ ఎఫెక్ట్… పెరిగిన జగ్గారెడ్డి ఇమేజ్ 

అంతకుముందు వరకు ఆయనను కాంగ్రెస్ లో ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకున్నా… ఆయన తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర బలంగా ఉండేది. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన జగ్గారెడ్డి… మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. కానీ సంగారెడ్డిలో భారీ సభను ఏర్పాటు చేసి సక్సెస్ సాధించిన తరువాత జగ్గారెడ్డి […]

తెలంగాణ భూ కుంభ‌కోణంలో కేసీఆర్ మంత్రి

తెలంగాణ‌లో భూ అక్ర‌మార్కులు చెల‌రేగార‌ని, సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతిలో ఆరితేరిపోయి.. అడ్డ‌గోలుగా స‌హాయం చేశార‌ని వార్త‌లు అందాయి. ఈ వ్య‌వ‌హారంలో టీ మంత్రుల హ‌స్తం కూడా ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో తీవ్రంగా ఫైరైన సీఎం కేసీఆర్‌.. వెంట‌నే ఏసీబీని రంగంలోకి దింపారు. అస‌లు విష‌యం ఏంటో అంతు తేల్చాల‌ని ఆదేశించారు. దీంతో ఇప్ప‌టికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు. అధికారులు భారీ ఎత్తున ఆస్తులు కూడ‌బెట్టార‌ని, అవినీతిలో పేట్రేగిపోయార‌ని […]

రాహుల్‌ను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా.. ?

తెలంగాణ మూడో ఆవిర్భావ దినోత్సవానికి ఒక్క రోజు ముందు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వెళ్లారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా… కాంగ్రెస్ విమర్శలను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రాహుల్ చేసిన విమర్శలకు కేటీఆర్, హరీశ్, కవిత వంటి వాళ్లు మాత్రమే స్పందిస్తారని తెలుస్తోంది. […]