వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ….జ‌గ‌న్ రెండు ఆఫ‌ర్లు

రాయ‌ల‌సీమ‌లోని క‌ర్నూలు జిల్లాలో గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా టీడీపీ అష్ట‌క‌ష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ గాలిలో 2004, 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ తేలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ దూకుడుతో టీడీపీ కేవ‌లం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే గెలిచింది. ప‌త్తికొండ నుంచి సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం కేఈ.కృష్ణ‌మూర్తి, బ‌న‌గాన‌ప‌ల్లి నుంచి బీటీ.జ‌నార్థ‌న్‌రెడ్డి, ఎమ్మిగ‌నూరు నుంచి జ‌య‌నాగేశ్వ‌ర్‌రెడ్డి విజ‌యం సాధించారు. వైసీపీ 11 ఎమ్మెల్యేల‌తో పాటు క‌ర్నూలు, […]

టీ కాంగ్రెస్‌లో ఆ ఇద్ద‌రే మొన‌గాళ్ల‌న్న కేసీఆర్ స‌ర్వే

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు తీపి కబురు చెప్పారు. కేసీఆర్ ప్ర‌తి మూడు నెల‌ల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై స‌ర్వేలు చేయిస్తున్నారు. తాజా స‌ర్వేలో ఏం బాంబు పేల్చుతారో అని గుండెలు ప‌ట్టుకుని చూసిన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈ స‌ర్వే ఫ‌లితాలు పెద్ద ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కేసీఆర్ ఈ స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించారు. ఈ […]

టీడీపీతో పొత్తుకు టీ కాంగ్రెస్‌లో వార్‌

వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజ‌కీయాలు చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఏపీలో జ‌న‌సేన ఎంట్రీతో టీడీపీ – వైసీపీ – జ‌న‌సేన మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్‌కు తెర‌లేస్తోంది. ఇక బీజేపీ – టీడీపీ మ‌ధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అన్న దానిపై కూడా ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే పొరుగు తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో నిన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ దూకుడుతో వార్ వ‌న్‌సైడ్‌గానే ఉంటుంద‌ని అంద‌రూ […]

తెలంగాణ‌లో రాజుకున్న రాజ‌కీయం

కోయిల ముందే కూసింది అన్న‌ట్టుగా.. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల టైం ఉండ‌గానే తెలంగాణ‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మ‌కంగా అప్పుడే అడుగులు క‌దుపుతున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019లో తెలంగాణ‌లో పాగా వేయాల‌ని కాంగ్రెస్, బీజేపీలు ప‌క్కా ప్లాన్‌ను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ రూపాల్లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై యుద్ధం చేసిన ఈ రెండు పార్టీలు ఇక నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. దీంతో తెలంగాణ‌లో […]

తెలంగాణ‌లో కేసీఆర్.. ఒంట‌ర‌వుతున్నారా..?

తెలంగాణ‌లో త‌న‌కంటూ తిరుగులేద‌ని భావించిన సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు చ‌క్క‌లు క‌న‌బ‌డుతున్నాయా? రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్త‌యిన త‌ర్వాత నెమ్మ‌దిగా ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త మొద‌లవుతోందా? ఇప్పుడు ఓ ర‌కంగా తెలంగాణ‌లో కేసీఆర్ ఒంట‌రి అవుతున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. నిజానికి తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే మాట ఇప్పుడు నిజంగానే తిర‌గ‌బ‌డుతోంది! ఎన్నిక‌ల స‌మ‌యంలో బంగారు తెలంగాణ ల‌క్ష్యం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా మ‌టుకు ఇప్ప‌టికీ నెర‌వేర‌క‌పోవడం దీనికి ప్ర‌ధాన […]

రాధా.. జ‌గ‌న్‌ల బంధానికి బీట‌లు..

విజ‌య‌వాడ‌లో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగ‌వీటి వంశ వార‌సుడు వంగ‌వీటి రాధాకృష్ణ‌కి వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి బెడిసి కొట్టింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయంగా వైసీపీకి కొంత‌కాలంగా త‌ట‌స్థంగా ఉంటూ వ‌స్తున్న రాధాని యువ నాయ‌క‌త్వం నుంచి జ‌గ‌న్ ఇటీవ‌ల త‌ప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జ‌గ‌న్ పార్టీకి గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి తండ్రి రంగా నుంచి వ‌చ్చిన వార‌స‌త్వంతో కాంగ్రెస్‌లో త‌న కంటూ గుర్తింపు పొందిన […]

టి-కాంగ్రెస్ `బాహుబ‌లి` వ‌స్తున్నాడా?

అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, విభేదాల‌తో నిండిపోయిన టి-కాంగ్రెస్‌కు కొత్త ర‌క్తం ఎక్కించేందుకు అధిష్టానం పావులు క‌దుపుతోంది. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవ‌డంతో పాటు సీఎం కేసీఆర్‌కు పోటీగా నిలిచే స‌రైన నాయ‌కుడి కోసం వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారించ‌డం మాని.. సీఎం అభ్య‌ర్థిగా నిల‌బ‌డేందుకు టి-కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు వ్యూహాలు ర‌చిస్తున్నారు. దీంతో ఇక పగ్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కుడికి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఉద్య‌మంలో కాంగ్రెస్ త‌ర‌ఫున కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌, ఢిల్లీలోనూ మంచి నాయ‌కుడిగా […]

ఆ రెడ్డి నాయ‌కుడే టి కాంగ్రెస్ సీఎం?!

ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం.. అన్న‌ట్లు ఉంది టికాంగ్రెస్ ప‌రిస్థితి. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్లు స‌మయం ఉండ‌గానే.. సీఎం అభ్య‌ర్థి ఎవ‌రనే చ‌ర్చ మొద‌లైపోయింది. సీఎం అభ్య‌ర్థిగా ఎవ‌రైతే బాగుంటుందో ఇప్పటి నుంచే.. అధిష్టానానికి విన్న‌పాలు కూడా వెళుతున్నాయ‌ట‌. అంతేగాక సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో తేలితేగాని ఒప్పుకోమని కార్య‌కర్త‌లు కూడా ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. మ‌రి నాయ‌కులే తొంద‌ర‌ప‌డుతున్నారో.. లేక కార్య‌క‌ర్త‌లే తొంద‌ర ప‌డుతు న్నారో తెలియ‌దు గానీ.. అధిష్టానానికి ముందుగా పీసీసీ చీఫ్ […]

కాంగ్రెస్ వాస‌న‌లు మ‌రిచిపోని చంద్ర‌బాబు

కాంగ్రెస్‌, తెలుగుదేశం.. రెండూ విరుద్ధ స్వ‌భావాలు గ‌ల పార్టీలు! కానీ ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీల్లో ఒకటే సంస్కృతి న‌డుస్తోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్న‌డూ లేని రీతిలో తెలుగుదేశం పార్టీలో అస‌మ్మ‌తివాదులు పెరుగుతున్నారు. ఒక‌ప్పుడు పార్టీపైనా, అధినేత‌పైనా విమ‌ర్శ‌లు చేయ‌డానికి ధైర్యం చేయ‌ని నేత‌లు.. ఇప్పుడు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఈ సంస్కృతి ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండేద‌ని విశ్లేష‌కులు గుర్తుచేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్న హ‌యాంలో కిక్కురుమ‌నేవారు కాద‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో పార్టీపై విమ‌ర్శ‌లు చేసే స్థితికి […]