సాక్షి గూటికి కొమ్మినేని!

కొమ్మినేని శ్రీనివాస రావు పరిచయం అక్కర్లేని జర్నలిస్ట్.ఈనాడు,ఆంధ్రజ్యోతి, టివి5,ఎన్టివి వంటి సంస్థల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. NTV లో రోజు ఉదయం ప్రసారమయ్యే KSR లైవ్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు.వివిధ పత్రికల్లో, ఛానళ్లలో పనిచేసిన ఆయన ఇటీవలే ఎన్టివి నుంచి బయటకు వచ్చారు. ఏ పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చిందో,అధికార పార్టీ నుండి ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో,ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మీడియా నడవకపోతే పరిణామాలెలా ఉంటాయో తన బ్లాగ్ లో వివరిస్తూ వాపోయాడు.కాగా […]

జగన్‌ కంచుకోటలో చంద్రబాబు పాగా !

కడప జిల్లా అంటే వైఎస్‌ జగన్‌ కంచుకోటగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటుంది. చిత్తూరు జిల్లాని చంద్రబాబు సొంత జిల్లా అనడం అరుదుగానే జరుగుతుంటుంది గానీ, రాజకీయంగా స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లాను తన కంచుకోటగా మలుచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాలో తన పట్టుని నిలబెట్టుకుంటూ వస్తున్న వైఎస్‌ జగన్‌కి షాక్‌ ఇచ్చేందుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, కడప జిల్లాలో మహా సంకల్ప సభను నిర్వహించారు. కడప జిల్లాలో ఈ దీక్ష కోసం పార్టీ […]

రెచ్చిపోతున్న అధికార నేతలు

రాష్ట్రంలో ‘అధికార’ రౌడీలు పెచ్చరిల్లిపోతున్నారు. సెటిల్‌మెంట్లు, దాదాగిరీతో విచ్చలవిడిగా ప్రవరిస్తున్నారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌, దౌర్జన్యాలు, బెదిరింపులు హెచ్చరికలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులపైనా దాడులకు దిగుతున్నారు. ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్‌ఐని, అడ్డుకున్న కానిస్టేబుళ్లను చితకబాదారు. విజయవాడ కార్పొరేషన్ లో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ హోంగార్డును తీవ్రంగా కొట్టాడు. నూజివీడు ప్రాంతంలో సెటిల్‌మెంట్‌ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు వృద్ధుడి మరణానికి కారణమయ్యారు. ఇక భూకబ్జాలు, ఇళ్లపైకి వెళ్లి అడ్డుకున్న వారికి కొట్టడాలు […]

డిప్యూటీ సీఎం రేసులో నారా లోకేష్‌ !

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలోకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేరతారని వినవస్తున్న ఊహాగానాలకు సంబంధించి లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏమిటంటే, ఏదో ఒక మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడికి కట్టబెడితే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే తన కుమారుడ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. ఏప్రియల్‌ లేదా మే నెలల్లో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టవచ్చునని టిడిపి వర్గాలు భావించాయి. అయితే […]

కోదండరామ్ పై గులాబీ దండయాత్ర

తెలంగాణ సర్కార్ తీరే వేరు. తమ వైఖరిని ప్రతిపక్షాలు ఎండగట్టినా పట్టించుకోదు. పైగా విపక్షనేతలపై తనదైన తరహాలో విరుచుకుపడుతుంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తుతుంది. ఇలాంటి అధికార పార్టీ కోదండరామ్ తమను విమర్శించగానే అగ్గి మీద గుగ్గిలమైంది. అధిష్టాన పెద్దలతో పాటూ చిన్నాచితకా నేతలూ ఆయనపై ఫైర్ అయిపోతున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడి ఎన్నికలు రాగానే ఫక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని ప్రకటించుకుంది. టీఆర్ఎస్ లక్ష్యం స్వరాష్ట్రాన్ని సాధించడమే […]

సోమూ వీర్రాజుపై అవినీతి అభియోగాలా..!

తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఇతర బీజేపీ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్న సోమూ వీర్రాజుపై తెలుగుదేశం పార్టీ తన అస్త్రాన్ని ప్రిపేర్ చేసింది. సోమూ వీర్రాజు పచ్చి అవినీతి పరుడు.. భారతీయ జనతా పార్టీ సభల నిర్వహణ కోసం నిధుల సేకరణ చేసి.. వాటిని మింగేశాడు అనేది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ఈ విధంగా సోమూవీర్రాజు అవినీతి పాల్పడ్డాడు అని తెలుగుదేశం నేతలు ఆఫ్ ది రికార్డుగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ […]

పట్టుబడ్డ రూ.570 కోట్లు ఆ రాజకీయ నేతవే..?!

తమిళనాడు నుంచి ఏపీ వైపు తరలి వస్తూ పట్టుబడి సంచలనం సృష్టించిన రూ.570 కోట్లు ఎవరివి? ఇంత సంచలనం కలిగించిన అంశం గురించి వార్తలు, చర్చలు చప్పున చల్లారి పోయాయేం? నిజంగానే ఈ డబ్బు బ్యాంకులదేనా.. నిజంగానే ప్రభుత్వానికి చెందిన సొమ్మేనా? ఒకవేళ బ్యాంకు వారే ఈ డబ్బును తెప్పించుకుంటున్నట్టు అయితే… ఆ పని సైలెంట్ అయిపోతుంది. కంటెయినర్లలో డబ్బుకు కాపాలాగా పోలీస్ ఫోర్సే ఉంటుంది. అయితే ఇక్కడ కంటైనర్లకు భద్రతగా వచ్చిన వ్యక్తులు చెక్ పోస్ట్ […]

టీడీపీ ఆ పని చేస్తే బీజేపీ ఊరుకుంటుందా?

ఒకవైపు “ప్రత్యేక హోదా’’ తో ఏమొస్తుందండీ.. అంటూ దాన్నితక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ప్రత్యేక హోదా వస్తే.. ఒక లాభం, అది తమ వల్ల వచ్చిందని చెప్పుకోవడానికి ఒక ప్లాన్ ను, అది గనుక రాకపోతే దాని కోసం తాము తీవ్రంగా ప్రయత్నించాం కానీ.. బీజేపీనే దానికి సహకరించలేదు.. అనే రెండో గేమ్ ప్లాన్ తో కూడా తెలుగుదేశం ముందుకు […]

విజయం తుమ్మలది…క్రెడిట్ కేటీఆర్‌ది..!

రాజకీయాల్లో, ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో ‘క్రెడిట్’ గొడవ ఎక్కువగా ఉంటుంది. అపజయానికి ఎవ్వరూ బాధ్యత తీసుకోరుగాని విజయం సాధిస్తే మాత్రం దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని నాయకులు ప్రయత్నాలు చేస్తారు. కొందరు నాయకులు క్రెడిట్ తమేక దక్కాలని నేరుగా చెప్పకపోయినా అనుచరులతో, వంధిమాగధులతో ప్రచారం చేయిస్తారు. ఈ విషయంలో మీడియాలోనూ అనేక కథనాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎవరు ఎందుకు ఓడిపోయారో, ఎవరు ఎందుకు […]