సాక్షి గూటికి కొమ్మినేని!

కొమ్మినేని శ్రీనివాస రావు పరిచయం అక్కర్లేని జర్నలిస్ట్.ఈనాడు,ఆంధ్రజ్యోతి, టివి5,ఎన్టివి వంటి సంస్థల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. NTV లో రోజు ఉదయం ప్రసారమయ్యే KSR లైవ్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు.వివిధ పత్రికల్లో, ఛానళ్లలో పనిచేసిన ఆయన ఇటీవలే ఎన్టివి నుంచి బయటకు వచ్చారు.

ఏ పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చిందో,అధికార పార్టీ నుండి ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో,ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మీడియా నడవకపోతే పరిణామాలెలా ఉంటాయో తన బ్లాగ్ లో వివరిస్తూ వాపోయాడు.కాగా లేటెస్ట్ గా కొమ్మినేని సాక్షి తీర్థం పుచ్చుకున్నాడని వినికిడి.ఇదేమంత సెన్సేషన్ కాకున్నా ఇప్పటివరకు తన సామాజిక వర్గానికి చెందినా మీడియా దగ్గరే పనిచేసిన కొమ్మినేనికి సాక్షి నిజంగా సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదే.అందులోను సాక్షి ఒక రాజకీయ పార్టీ వెన్ను దన్నుగా నడిచే మీడియా అందులో స్వతంత్ర భావ వ్యక్తీకరణకు చోటుండదు.పైగా ఇప్పటికే సాక్షి లో 2-3 గ్రూప్స్ వున్నాయి ఒక గ్రూపు జర్నలిస్టు సంఘం నాయకుడు అమర్ది కాగా, మరో గ్రూప్ ప్రియదర్శిని రామ్ది. వీరు కాక ‘దిలీప్రెడ్డి’ది మరో గ్రూప్. ఇన్ని గ్రూప్ల మధ్య ‘కొమ్మినేని’ ఎలా పనిచేస్తాడో చూడాలి మరి.